ఏప్రిల్ 4న మేధావుల సదస్సు
కొవ్వూరు : ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఏప్రిల్ 4న హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటీలో నిర్వహించే మేధావుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెట్టె రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొవ్వూరు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదిగలు, మాదిగల ఉపకులాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అధికశాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే కార్ లోన్స్‌పై జీవో నంబర్ 25 అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లిడ్‌క్యాప్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.