ఆదివారం అసలు సెలవు రోజేనా! అంతకు ముందు ఇది ఉందా? | Sunday Is The Actual Day Off What Was The Fact | Sakshi
Sakshi News home page

ఆదివారం అసలు సెలవు రోజేనా! అంతకు ముందు ఇది ఉందా?

Published Sun, Jul 9 2023 12:32 PM | Last Updated on Thu, Aug 17 2023 3:21 PM

Sunday Is The Actual Day Off What Was The Fact - Sakshi

అప్పట్లో మన దేశములో ఆదివారం సెలవు రోజు కాదు. నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే తరువాత రోజుల్లో సామెతగా మారి -'అమావాస్యకో పున్నమికో' అంటుంటాము కదా? ఇక పోతే నేడు మనం సెలవు దినంగా భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది . ఆదివారం మనకి చాలా శక్తిమంతమైన దినం. మనకు ఆ రోజు సూర్యారాధన దినము, చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు.

భారతీయులు మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆదివారం అంటే సెలవు రోజు, మందు మాంసాల దినంగా మారింది. కానీ అంతకు ముందు ఆ రోజు మనకు ఓ సుదినం . అప్పటిలో వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు మాత్రం గురుకులాల్లో పక్షానికి నాలుగు దినాలు అనగా పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ అమావాస్య రోజులు అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో అశోకవనంలో ఉన్న సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి .

పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. ఇక్కడ చింతన అంటే జరిగిన పాఠాన్ని మరొకరితో పాటు చదువడం, పరిశీలించడం తదితరాలు అని. ఐతే అవ కూడా ఆ పాఢ్యమి రోజు చేసేవారు కాదట. ఆదివారం నాడు విధిగా సూర్యోపాసన చేసేవారు. మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు వెళ్ళింది.

అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు "స్త్రీ తైల మధు మాంసాని  యే త్యజంతి రవేర్దినే నవ్యాధిః శోక దారిద్యం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకం లో ఉంది. మానవుడు ఏ రోజున  ఆ పనులు చేయకూడదని శాస్త్రాలు వక్కాణించాయో.. ఆరోజే ఆచారించి ఎంజాయ్‌ చేస్తున్నాం. ఆఖరికి ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని వ్యాధులు, రుగ్మతలకు ఆదివారం రోజున కచ్చితంగా మద్యం మాంసం తినొద్దని రోగులకు సూచిస్తారు. వాస్తవానికి ఈ విషయాలు అందరికీ చెప్పడానికి శక్తి సరిపోకపోవచ్చు కనీసం తెలుసుకున్న కొందరైనా ఈవిషయాలను గుర్తించి.. ఆచరించినా చాలు.  

(చదవండి: మనిషి జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! నిన్ను కూడా అంతే ఏమీ లేకుండానే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement