![RBI Cancels March 31 Bank Holiday](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/rbi_1_0.jpg.webp?itok=FqDKcblH)
మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.
2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్‌బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్‌లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment