టూరిజం బోట్లకు అనుమతి
పోలవరం : దాదాపు 15 రోజుల విరామం తరువాత పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకువెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి లభించింది. దీంతో ఆదివారం టూరిజం బోట్లలో పర్యాటకులు గోదావరి విహారానికి తరలివెళ్లారు. పర్యాటకుల భద్రత పట్ల బోట్ల యజమానులు శ్రద్ధ వహించటం లేదంటూ ఇటీవల బోటులను ఇరిగేషన్‌శాఖ బీఎస్ జి.ప్రసన్నకుమార్ నిలిపివేసిన విషయం తెలిసిందే. బోటుల యజమానులతో రెండు రోజుల క్రిందట సమావేశం నిర్వహించి, నిబంధనలు పాటించేందుకు అంగీకరించిన తరువాత తిరిగి అనుమతి ఇచ్చారు. ప్రధానంగా సమయపాలన పాటించాలని,లై ఫ్ జాకెట్స్ పర్యాటకులందరికీ ఇవ్వాలని, లైసెన్స్‌లు బోటులో సిద్ధంగా ఉంచాలని, ఎవరు అడిగినా చూపించాలని, బోట్లు మధ్యలో ఆగిపోతే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఇతర బోటుల్లో పోలవరం చేర్చాలని నిబంధనలు విధించినట్టు బోటుల తనిఖీ అధికారి ఆర్.కొండలరావు తెలిపారు.