in godavari
-
గర్భంనిండా గరుకే
కొవ్వూరు : గోదావరి డెల్టా ఆయకట్టు రైతులు ఏటా సార్వాలో ముంపు.. దాళ్వాలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన ఇసుక మేటలు పేరుకుపోవడంతో నదిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సహజ జలాలు ఆశించిన స్థాయిలో అందకపోవడంతో గడచిన ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు సార్లు దాళ్వాలో లో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఇవి పూర్తయితే దిగువకు నీరు వచ్చే దారిలేదు. ఈ తరుణంలో ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోకపోతే రైతుల కష్టాలు మరింత తీవ్రమవుతాయని. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నదిలో ఇసుక మేటల తొలగింపే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కుబడిగా డ్రెడ్జింగ్ ఆనకట్ట రిజర్వాయర్ ఎగువన సుమారు 65–70 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక మేటలు పేరుకుపోయినట్టు 2015లో నిపుణుల బృందం నిర్థారించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లు వెచ్చించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే తొలగించి చేతులు దులిపేసుకుంది. గత ఏడాది పిచ్చుకల్లంక వద్ద 9.70 లక్షల క్యూబిక్ మీటర్లు, రాజమండ్రిలో కోటిలింగాల ఘాట్ వద్ద 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి తొలగించారు. ఈ మేటలు తొలగించడం వల్ల ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం 0.30 టీఎంసీలు పెరిగిందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. లంకలతో కలిపితే 2.5 కోట్ల క్యూబిక్ మీటర్లు లంకలతో కలుపుకుంటే గోదావరిలో పేరుకుపోయిన ఇసుక 2.50 కోట్ల నుంచి 3 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని నిపుణుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుని దానికి ఎగువన మూడు కిలోమీటర్లు, దిగువన కిలోమీటర్ వరకు ఇసుక త్వవకాలపై నిషేధం ఉంది. కొవ్వూరు–కాతేరు మధ్య నిర్మించిన రెండో రోడ్డు వంతెన నుంచి వాడపల్లి సమీపం వరకు 8 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలు భారీగా ఉన్నట్టు నిపుణుల బృందం గుర్తించింది. వీటిని తొలగించటం ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవడంతోపాటు.. ఆ ఇసుకను విక్రయించటం ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుం దని అంచనా వేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడున్నర దశాబ్దాల క్రితం వరకు గోదావరిలో ఏటా డ్రెడ్జింగ్ చేసి ఇసుక మేటలు తొలగించేవారు. ఆ తరువాత ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడంతో ఆ ప్రక్రియ మరుగున పడింది. మేటలు పూర్తిగా తొలగించాలి ఇసుక మేటల తొలగింపు కార్యక్రమం మొక్కుబడిగా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ధవళేశ్వరం ఆనకట్టకు ఎగువన ఉన్న ఇసుక మేటలన్నీ డ్రెడ్జింగ్ చేసి పూర్తిస్థాయిలో తొలగించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. తద్వారా ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. రబీలో డెల్టా రైతులకు సాగునీటి ఇబ్బందులు అధిగవిుంచే అవకాశం ఏర్పడుతుంది.– విప్పర్తి వేణుగోపాల్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ధవళేశ్వరం 0.30 టీఎంసీల సామర్థ్యం పెరిగింది పిచ్చుకల్లంక, కోటి లింగాల ఘాట్ వద్ద డ్రెడ్జింగ్ చేసి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికితీశాం. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటినిల్వ సామర్థ్యం 0.30 టీఎంసీలు పెరిగింది. ముఖ్యంగా ఆనకట్టకు సమీపంలో కోటి క్యూబిక్ మీటర్లు ఇసుక మేటలున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది.– ఎన్ .కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్ -
విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి
కొవ్వూరు రూరల్: వేసవి తాపం ప్రజలను గోదావరి వైపు పరుగులు తీయిస్తోంది. కొవ్వూరు మండలం మద్దూరలంక వద్ద విజ్జేశ్వరం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున సందర్శకులు చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. బ్యారేజ్ దిగువన ఉన్న స్పిల్ వే పైకి వాహనాలతో చేరుకున్న జనం గోదావరిలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. కొందరు బ్యారేజ్ స్తంభాలపై నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరిలోకి దూకుతున్నారు. బ్యారేజ్ వద్ద ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. వచ్చే సందర్శకులను అదుపు చేసేందుకు పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
డెల్టా కంట తడి
in godavari, water level down, water problem గోదావరిలో పడిపోయిన ప్రవాహ జలాలు , పొంచి ఉన్న సాగునీటి గండం పశ్చిమ డెల్టా కంటతడి పెడుతోంది. గోదావరి నదిలో సహజ జలాలు పడిపోవడంతో నీటి తడులు అందక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంతులవారీ విధానం అమల్లో ఉన్నా.. రైతుల కష్టాలు తీరడం లేదు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ముప్పు పొంచి ఉంది. కొవ్వూరు : గోదావరి నదిలో ప్రవాహ జలాలు గణనీయంగా పడిపోయాయి. రబీ సీజన్లో డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు నాటికి సీలేరుతో కలిపి 90 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కకట్టారు. దీనిలో ఇప్పటి వరకు 61.208 టీఎంసీల నీరు వాడేశారు. ఇంకా సుమారు రెండు నెలలు రబీసాగుకు నీటితడులు అందించాలి. పంటలు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం మార్చి నెలకు 30 టీఎంసీల నీరు అవసరం. కానీ అందుబాటులో ఉన్నది మాత్రం 29 టీఎంసీలే. దీనిలో ఈనెలాఖరు వరకు సాగునీటి సరఫరాకు 13 టీఎంసీల వరకు వాడే అవకాశం ఉంది. అంటే మిగిలేది 16 టీఎంసీలే. అంటే పంట గట్టెక్కాలంటే ఇంకా 10 నుంచి 15 టీఎంసీల నీరు అదనంగా అవసరం ఉందని అధికార వర్గాల అంచనా. ఫలితంగా నీటి పొదుపు చర్యలు పటిష్టంగా అమలు చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తగ్గుతున్న నీటిమట్టం ఈనెల 15 నుంచి గోదావరి నీటి మట్టం క్రమేణా తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పాండ్లెవెల్ 15న 13.32 మీటర్లు ఉంటే 19 నాటికి 13.23 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి 8,240 క్యూసెక్కుల నీరు అందుతోంది. దీనిలో సీలేరు నుంచే 5,300 క్యూసెక్కులు వస్తోంది. అంటే గోదావరి ప్రవాహ జలాలు 3వేల క్యూసెక్కులలోపు మాత్రమే వస్తున్నాయన్నమాట. రానున్న రోజుల్లో వేసవి నేపథ్యంలో ఎండల తీవ్రత పెరిగితే ప్రవాహ జలాల లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండలు క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా సాగుకు నీటితడుల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కులు కచ్చితంగా అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినా కేవలం 4,280 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. నీరందక రైతుల అవస్థలు డెల్టాలోని ప్రధానంగా అత్తిలి మండలం ఈడూరు, కంచుమర్రు, కొమ్మర, స్కిన్నెరపురం, పాలకొడేరు మండలం మోగల్లు, మైప, గరగపర్రు, పాలకోడేరు, కుముదవల్లి, కొండేపూడి, కోరుకొల్లు, శృంగవృక్షం, కాళ్ల మండలం కాళ్లకూరు, ఆకివీడు మండలం చెరుకుమిల్లి, ఉండి మండలం చెరుకువాడ, కలిసిపూడి తదితర గ్రామాల ఆయకట్టులో రైతులు నీటి తడులందక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు నీళ్లందక ఆయిల్ ఇంజిన్ల సాయంతో తోడుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా అందించే ఆయిల్ ఖర్చులూ ఈ ఏడాది అందించడం లేదు. గత ఏడాది చెల్లించాల్సి ఆయిల్ ఖర్చులు ఇప్పటికీ చాలామంది రైతులకు ఇవ్వలేదు. నీటి ఎద్దడి పరిష్కారానికి 187 చోట్ల కాలువలకు అడ్డుకట్టలు వేయాలని అధికారులు నిర్ణయించినా 60 చోట్ల మాత్ర మే అడ్డుకట్టలు వేశారు. మరో అరవై ప్రదేశాలలో నీళ్లు ఎత్తిపోయాలని నిర్ణయించినా కేవలం 25 చోట్ల మాత్రమే మోటార్లు, కరెంటు సిద్ధం చేశారు. పథకం నిర్వహణపై శ్రద్ధేదీ! పెనుగొండ మండలం దొంగరావి పాలెం వద్ద ఏటా రబీ సీజన్లో ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్ ఆయకట్టు నీటి అవసరాలు తీరుస్తున్నారు. గత ఏడాది ఎత్తిపోతల పథకం నిర్వహణకు బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది ఈ పథకం మూలనపడింది. దీని ద్వారా ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లో ఆయకట్టుతోపాటు పోడూరులో కొంత ఆయకట్టుకు సంమృద్ధిగా నీరందించే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా యత్నాలు ప్రారంభించలేదు. కనీసం రెండు టీఎంసీల నీటిని అదనంగా గోదావరి నుంచి వాడుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ రబీ సీజన్లో గోదావరి నుంచి పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సరఫరా చేసిన నీటి వివరాలు నెల సరఫరా సహజ జలాలు సీలేరు జలాలు ( టీఎంసీల్లో ) డిసెంబర్ 25.192 17.201 7.991 జనవరి 23.144 13.208 9.936 ఫిబ్రవరి 12.872 5.288 7.584 మొత్తం 61.208 35.697 25.111 ఇబ్బందులు పడుతున్నాం సాగునీరందక చేలన్నీ బీటలు వారుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడుకుంటున్నాం. ఎకరా తడికి ఒక పర్యాయానికి రూ.800 ఖర్చు అవుతోంది. రాత్రి, పగలు చేలవద్ద కాపాలా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నీటికోసం అదనపు వ్యయం కావడంతో కౌలు రైతులు నష్టపోవాల్సివస్తోంది. – కె సూర్రావు, కౌలురైతు, కంచుమర్రు -
గలగలా గోదారి..
ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి ఉధృతి స్వల్పంగా పెరిగింది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజ్ వద్ద 6.50 అడుగుల నీటిమట్టం ఉండగా 3,24,806 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాచలం వద్ద 37.80 అడుగులకు చేరుకున్న నీటిమట్టం సాయంత్రం 6 గంటల వరకూ అదేస్థాయిలో నిలకడగా కొనసాగింది. తూర్పు డెల్టాకు 500, మధ్య డెల్టాకు 1000, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరగడంతో బుధవారం ఉదయానికి కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.46 మీటర్లు, కూనవరంలో 12.52 మీటర్లు, కుంటలో 4.47 మీటర్లు, కొయిదాలో 16.26 మీటర్లు, పోలవరంలో 10.37 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.02 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. కళకళా తాండవ కోటనందూరు : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తాండవ జలాశయం నిండు కుండలా కళకళలాడుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా జలాశయం సముద్రాన్ని తలపిస్తోంది. క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నందున ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో వస్తోందని తాండవ అధికారులు చెబుతున్నారు. జలాశయ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ఇప్పటికే 372.5 అడుగులకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 377 అడుగులకు చేరితే తరువాత వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా అదే స్థాయిలో నీటిని నదికి విడిచి పెడతామని డీఈ రాజేంద్రకుమార్ తెలిపారు. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు ఉన్నందున ఆయకట్టుకు నీటి అవసరం లేదని, పంట చివర్లో కొంతమేర నీటిని విడిచి పెట్టి, రబీకి కూడా పూర్తిస్థాయిలో అందుతుందని డీఈ వివరించారు. జలాశయాన్ని పరిశీలించిన డీఈ తాండవ జలాశయాన్ని డీఈ ఎం.రాజేంద్రకుమార్ మంగళవారం పరిశీలించారు. జలాశయానికి ఉధృతంగా నీరు వస్తున్నందున ఏఈలు శ్యామ్‌కుమార్, చిన్నారావు, వర్క్ ఇన్స్పెక్టర్ నాగబాబులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. సందర్శకులను ఎవరిని జలాశయం వద్దకు వెళ్లనీÄñæ¬ద్దని సిబ్బందిని ఆదేశించారు. -
గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు బ్రేక్
పిచ్చుకలంలో తాత్కలికంగా పనులు నిలుపుదల బొబ్బర్లంక (ఆత్రేయపురం) : ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రక్షిత ప్రాంతంలో పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన గోదావరి డ్రెడ్జింగ్ పనులను తాత్కాలికంగా ఆదివారం నిలుపుదల చేశారు. ఇటీవల చేపట్టిన డ్రెడ్జింగ్ పనులను ఆదివారం నిలిచిపోవడం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఇక్కడ పనులు తీరు తెన్నులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. ఈ తరుణంలో డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తుండగా పిచ్చుకలంకలో తుప్పలు, ముల్ల పొదలు అడ్డురావడం వల్ల తాత్కాలికంగా పనులు నిలుపుదల చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఓషియన్ పార్కు ఆధ్వర్యంలో రూ .16 కోట్లతో బ్యారేజీకి ఎగువ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించారు. దీనిపై హెడ్ వర్క్స్ ఈఈ కృష్ణారావును వివరణ కోరగా ముళ్ల తుప్పలు, చెట్లు కారణంగా డ్రెడ్జింగ్ యంత్రాలు రిపేర్లు మరియు నిర్వహణ నిమిత్తం హైదరాబాద్ పంపినందున తిరిగి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. -
టూరిజం బోట్లకు అనుమతి
పోలవరం : దాదాపు 15 రోజుల విరామం తరువాత పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకువెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి లభించింది. దీంతో ఆదివారం టూరిజం బోట్లలో పర్యాటకులు గోదావరి విహారానికి తరలివెళ్లారు. పర్యాటకుల భద్రత పట్ల బోట్ల యజమానులు శ్రద్ధ వహించటం లేదంటూ ఇటీవల బోటులను ఇరిగేషన్‌శాఖ బీఎస్ జి.ప్రసన్నకుమార్ నిలిపివేసిన విషయం తెలిసిందే. బోటుల యజమానులతో రెండు రోజుల క్రిందట సమావేశం నిర్వహించి, నిబంధనలు పాటించేందుకు అంగీకరించిన తరువాత తిరిగి అనుమతి ఇచ్చారు. ప్రధానంగా సమయపాలన పాటించాలని,లై ఫ్ జాకెట్స్ పర్యాటకులందరికీ ఇవ్వాలని, లైసెన్స్‌లు బోటులో సిద్ధంగా ఉంచాలని, ఎవరు అడిగినా చూపించాలని, బోట్లు మధ్యలో ఆగిపోతే పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఇతర బోటుల్లో పోలవరం చేర్చాలని నిబంధనలు విధించినట్టు బోటుల తనిఖీ అధికారి ఆర్.కొండలరావు తెలిపారు. -
గోదావరిలో మునిగి యువకుడి మృతి
పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగిన వైనం భద్రత చర్యలు లేవని అధికారులపై విమర్శలు కేదారిలంక (కపిలేశ్వరపురం) : గోదావరి నదిలో కేదారిలంక వద్ద పుష్కర స్నానానికి వెళ్లిన యువకుడు యర్రంశెట్టి సతీష్(19) నీటమునిగి చనిపోయాడు. గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనతో విషాదం అలముకుంది. అధికారులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేదారిలంక గ్రామానికి చెందిన సతీష్, తన ఇద్దరి స్నేహితులతో కలిసి పుష్కర స్నానానికి వెళ్లాడు. తొగరపాయ వద్ద అధికారికంగా పుష్కర ఏర్పాట్లు చేసినప్పటికీ, విశాలంగా ఉండడంతో సతీష్, అతడి స్నేహితులు ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా సతీష్ అదుపుతప్పి నదిలో మునిగిపోయాడు. తహసీల్దార్ జి.చిన్నిబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టడంతో, అదే ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్, వీఆర్ఓ వెంకటరమణ శవ పంచనామా చేసి, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొడుకు అర్ధాంతరంగా దూరమయ్యాడంటూ సతీష్ తండ్రి నాగేశ్వరరావు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చివరి క్షణంలో హడావిడి చర్యల వల్లే.. గ్రామంలో అంత్య పుష్కరాల నిర్వహణ కోసం ఘాట్‌కు అనుమతి ఇవ్వలేదు. చివరలో ఉన్నతాధికారులు రేవులో ఏర్పాట్లు చేయండంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో, గ్రామంలోని సూర్యగుండాల రేవు వద్ద అధికారికంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు అక్కడ కాకుండా, విశాలంగా ఉన్న ఇసుక ర్యాంపు రేవు వద్ద స్నానాలు చేస్తున్నారు. ప్రధాన పుష్కరాల సమయంలో కూడా ఇదే పరిస్థితి తలñ త్తడంతో, అధికారులు రెండు చోట్లా ఏర్పాట్లు చేసి, భద్రత చర్యలు తీసుకున్నారు. అంత్య పుష్కరాలకు మాత్రం ఇసుక ర్యాంపు రేవు వద్ద చర్యలు చేపట్టలేదు. పడవలో గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. దీనిపై తహశీల్దార్ జి.చిన్నిబాబును వివరణ కోరగా, అపాయకర రేవు వద్ద స్నానాలకు దిగవద్దని రెవెన్యూ, పోలీసు సిబ్బంది వారిస్తున్నా, భక్తులు మాట వినకపోవడం వల్ల సమస్య తలెత్తిందని పేర్కొన్నారు.