విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి | visitors strike to vijjeswaram barrage | Sakshi
Sakshi News home page

విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి

Published Mon, May 15 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి

విజ్జేశ్వరం బ్యారేజ్‌కు సందర్శకుల తాకిడి

కొవ్వూరు రూరల్‌: వేసవి తాపం ప్రజలను గోదావరి వైపు పరుగులు తీయిస్తోంది. కొవ్వూరు మండలం మద్దూరలంక వద్ద విజ్జేశ్వరం బ్యారేజ్‌ వద్దకు పెద్ద ఎత్తున సందర్శకులు చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. బ్యారేజ్‌ దిగువన ఉన్న స్పిల్‌ వే పైకి వాహనాలతో చేరుకున్న జనం గోదావరిలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. కొందరు బ్యారేజ్‌ స్తంభాలపై నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో గోదావరిలోకి దూకుతున్నారు. బ్యారేజ్‌ వద్ద ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టక పోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. వచ్చే సందర్శకులను అదుపు చేసేందుకు పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement