పట్నా: బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్‌పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం.
భోజ్‌పూర్‌లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్‌పూర్‌లో అయిదుగురు, జెహానాబాద్‌లో నలుగురు, పట్నా, రొహతాస్‌ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment