యువతిపై కత్తితో దాడి | knife attack on women | Sakshi
Sakshi News home page

యువతిపై కత్తితో దాడి

Published Sun, Apr 16 2017 11:45 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

యువతిపై కత్తితో దాడి - Sakshi

యువతిపై కత్తితో దాడి

పశివేదల (కొవ్వూరు రూరల్‌): పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో యువతిపై ఓ వ్యక్తి పాశవికంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తల్లిదండ్రులు, స్థానికులపై కూడా దాడికి దిగడంతో అతడికి దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కొవ్వూరు మండలం పశివేదలకు చెందిన మావూరి సూరిబాబుకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఆఖరి కుమార్తె సరస్వతి రాజమండ్రిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రోజూ విధులకు రాజమండ్రి వెళ్లి వస్తుండగా మూడేళ్ల నుంచి కార్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ నడుపుతున్న చాగల్లు మండలం గౌరిపలి్లకి చెందిన వరసాల రవిప్రకాష్‌ ఆమెను పెళ్లి చేసుకోమని వేధించ సాగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో గతేడాది డిసెంబర్‌ 15న ఆమె కొవ్వూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రవిప్రకాష్‌ను మందలించి వదిలివేశారు. అయినా వేధింపులు మానలేదు. ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా చర్చికి వెళుతున్న సరస్వపై ఆమె ఇంటి సమీపంలోనే రవిప్రకాష్‌ దాడికి పాల్పడ్డాడు. 
సరస్వతి కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు స్థానిక యువకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కూడా దాడికి దిగాడు. వారంతా కలిసి రవిప్రకాష్‌కు దేహశుద్ధి చేశారు. బాధితురాలు సరస్వతి కొవ్వూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకే సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement