వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి | ysrcp karyakartalapi dadi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి

Published Sun, Aug 28 2016 11:18 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి - Sakshi

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి

దొమ్మేరు (కొవ్వూరు రూరల్‌): దొమ్మేరులో ఆదివారం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు కొక్కిరపాటి శ్రీహరి ఇంట్లో నీరు రోడ్డుపైకి రావడంతో అదే వార్డుకు చెందిన కొక్కిరపాటి సంతోషంతో పాటు మరొకరు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన శ్రీహరి కర్రతో దాడి చేయగా సంతోషం తీవ్రంగా మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై సంతోషం బంధువు కొక్కిరిపాటి హరిబాబు ప్రశ్నించగా శ్రీహరి అతడిపై కూడా దాడి చేసి తలపై గాయపర్చాడు. బాధితులను వారి బంధువులు కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సంతోషం పరిస్థితి విషమించడంతో రాజమండ్రి ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. సంఘటనపై ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీ సభ్యులు ముదునూరి నాగరాజు, బండి పట్టాభిరామారావు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావును కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తక్షణమే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. 
దాడి సంఘటనపై కేసు నమోదు
దొమ్మేరులో ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన సంఘటనలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎసై ్స డి.గంగాభవాని తెలిపారు. కొక్కిరపాటి సంతోషం, కొక్కిరపాటి హరిబాబు, మరో వ్యక్తిపై దాడి చేసి గాయపరచిన కొక్కిరపాటి శ్రీహరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎసై ్స తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement