సీపీఎస్ రద్దుకు ఉద్యమం
సీపీఎస్ రద్దుకు ఉద్యమం
Published Mon, Feb 13 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
భీమవరం టౌన్ : భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం పీ ఆర్‌టీయూ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూ టరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్ ), వేతన వ్యవస్థ, ఉపాధ్యాయ సమస్యలపై జిల్లాస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయు డు మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకు పెద్దెత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. ఈ విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకువెళ్లామని, ముఖ్యమంత్రితో ఈ అం శంపై చర్చించామన్నారు. న్యాయం జరగని పక్షంలో సీపీఎస్ రద్దయ్యే వరకూ పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చా రు. పీఆర్‌టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆర్.కేశీయమ్మ తదితరులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీఆర్‌టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీ కాంతారావు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ వీరవల్లి వెంకటేశ్రరావు, ఎన్నార్పీ అగ్రహారం హెచ్‌ఎం ఎంవీ సత్యనారాయణ మాట్లాడారు.
ఒకే ఉద్యోగం.. ఒకే పెన్షన్ కావాలి
కాంట్రీబ్యుటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీని వాసులనాయుడు డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా సదస్సులో పాల్గొనేందుకు వచ్చి న ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్‌తో 2004 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు పదవీ విరమణ అనంతరం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి రద్దుకు డిమాండ్ చేశామన్నారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి ఒకే ఉద్యోగం, ఒకే పెన్షన్ పథకం అమలు చేయాలని పోరాడుతూనే ఉం టామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు పోరాట ఫలితంగా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్య క్తం చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌తో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నష్టం లేదని, ఉపాధ్యాయులకు పదోన్నతులు లభి స్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రా క్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. రూ.398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడు తూ సీపీఎస్ రద్దు కోరుతూ జిల్లా వ్యా ప్తంగా ఆందోళనలకు కార్యాచరణ రూ పొందిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement