అదిరిన కేటీఎం బైక్‌ స్టంట్‌ షో | ktm bike stunt race | Sakshi
Sakshi News home page

అదిరిన కేటీఎం బైక్‌ స్టంట్‌ షో

Published Mon, Nov 21 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

అదిరిన కేటీఎం బైక్‌ స్టంట్‌ షో

అదిరిన కేటీఎం బైక్‌ స్టంట్‌ షో

భీమవరం  యూరోపియన్‌ రేసింగ్‌ లెజండ్‌ కేటీఎం స్టంట్‌ షో భీమవరం పట్టణంలో యువతను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్థానిక కోస్టల్‌ సిటీ సెంటర్‌(గీతా మల్టీ ప్లె్లక్స్‌) ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన స్టంట్‌ షోలో ప్రొఫెషనల్‌ స్టంట్‌ రైడర్స్‌ అద్భుతమైన స్టంట్‌రైడ్స్, ట్రిక్స్‌ను కేటీఎం డ్యూక్‌ బైక్‌లతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. బైక్‌ వెనుక చక్రాన్ని గాలిలోకి లేపడం, చేతులు వదిలి నడపడం, బైక్‌ కింది భాగంలో కూర్చుని నడపడం, ముందు చక్రాన్ని పైకి లేపి కేవలం వెనుకచక్రంతో ముందుకు వెళ్లడం, బైక్‌పై నిలబడి ముందుకు వెళ్లడం వంటి అద్భుత విన్యాసాలు అబ్బుర పరిచాయి.

ఈ సందర్భంగా బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ప్రో బైకింగ్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌నంది మాట్లాడుతూ హై ఫెర్‌ఫార్మెన్‌ స రేసింగ్‌ బైక్‌లకు కేటీఎం బ్రాండ్‌ ప్రసిద్ధి అన్నారు. వినియోగదారులకు ఉత్తేజకరమైన సాహస అనుభూతులను కేడీఎం బైక్‌లు అందిస్తాయన్నారు. భవిష్యత్తులో ప్రొఫెషనల్‌ స్టంట్స్‌ని ప్రతి ప్రధాన పట్టణంలో నిర్వహించనున్నామన్నారు.  ఇప్పటివరకు  స్టంట్‌ షోలను చెన్నయ్, విజయపూర్, లక్నో, జబల్‌పూర్, ఔరంగాబాద్, జలంధర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, కాంచీపురం వంటి నగరాల్లో నిర్వహించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement