మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి
భీమవరం: హిందూ సంప్రదాయం ప్రకారం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కషి చేసినట్లవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ వుంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం భీమవరంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల కాలంలో ప్రమాదకరమైన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడుతున్నారని, దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా భీమవరం.కామ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు(చినబాబు), బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, కార్యక్రమ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్బరాజు, గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, కార్మూరి సత్యనారాయణమూర్తి, పళ్ల ఏసుబాబు పాల్గొన్నారు.