ఆకట్టుకున్న కరాటే విన్యాసాలు
నిడదవోలు : పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ కరాటే పోటీల్లో భాగంగా క్రీడాకారులు చేసిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆయుధాలతో ప్రదర్శన చేశారు. చిన్నపిల్లలు సైతం కరాటే డెమోలు ఇచ్చి అబ్బురపరిచారు. రెండు కుర్చీలపై ఒక వ్యక్తి పడుకుని పొట్టపై ఐస్ ఉంచుకోగా కొందరు సుత్తితో బద్దలు కొట్టిన దృశ్యాలు అలరించాయి. మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రవీలాల్ వానీ, ఏపీ చీఫ్ ఇ న్‌స్ట్రక్టర్ జీవీ రమణ. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కారింకి సాయిబాబు, మేరుగుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.