karate competitions
-
ఆకట్టుకున్న కరాటే విన్యాసాలు
నిడదవోలు : పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ కరాటే పోటీల్లో భాగంగా క్రీడాకారులు చేసిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆయుధాలతో ప్రదర్శన చేశారు. చిన్నపిల్లలు సైతం కరాటే డెమోలు ఇచ్చి అబ్బురపరిచారు. రెండు కుర్చీలపై ఒక వ్యక్తి పడుకుని పొట్టపై ఐస్ ఉంచుకోగా కొందరు సుత్తితో బద్దలు కొట్టిన దృశ్యాలు అలరించాయి. మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రవీలాల్ వానీ, ఏపీ చీఫ్ ఇ న్స్ట్రక్టర్ జీవీ రమణ. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కారింకి సాయిబాబు, మేరుగుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం
పరిగి : మండల పరిధిలోని జాఫర్‌పల్లి మోడల్ స్కూల్ విద్యార్థి జే రిషి జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఫ్రీడమ్ ఫైటర్ ఆల్ ఇండియా కుంగ్‌ఫూ మరియు కరాటే ఆధ్వర్యంలో శంషాబాద్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంటులో రిషి ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించారు. అతడిని పరిగి న్యూ మ్యాక్స్ కుంగ్‌ఫూ మాస్టర్ రమేష్, ప్రిన్సిపాల్ యాదయ్య, పీఈటీ శ్రీకాంత్‌లు అభినందించారు. -
కరాటే పోటీలు ప్రారంభించిన సుమన్
విజయవాడ: విజయవాడలోని దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.