
కుంగ్‌ఫూలో పరిగి విద్యార్థికి బంగారు పతకం
పరిగి : మండల పరిధిలోని జాఫర్‌పల్లి మోడల్ స్కూల్ విద్యార్థి జే రిషి జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. ఫ్రీడమ్ ఫైటర్ ఆల్ ఇండియా కుంగ్‌ఫూ మరియు కరాటే ఆధ్వర్యంలో శంషాబాద్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంటులో రిషి ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించారు. అతడిని పరిగి న్యూ మ్యాక్స్ కుంగ్‌ఫూ మాస్టర్ రమేష్, ప్రిన్సిపాల్ యాదయ్య, పీఈటీ శ్రీకాంత్‌లు అభినందించారు.