ndd
-
ఆకట్టుకున్న కరాటే విన్యాసాలు
నిడదవోలు : పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ కరాటే పోటీల్లో భాగంగా క్రీడాకారులు చేసిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆయుధాలతో ప్రదర్శన చేశారు. చిన్నపిల్లలు సైతం కరాటే డెమోలు ఇచ్చి అబ్బురపరిచారు. రెండు కుర్చీలపై ఒక వ్యక్తి పడుకుని పొట్టపై ఐస్ ఉంచుకోగా కొందరు సుత్తితో బద్దలు కొట్టిన దృశ్యాలు అలరించాయి. మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రవీలాల్ వానీ, ఏపీ చీఫ్ ఇ న్స్ట్రక్టర్ జీవీ రమణ. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కారింకి సాయిబాబు, మేరుగుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు
నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో నిడదవోలుకు చెందిన ఎస్కే సలీం, ఎం.జావేద్ రెహమాన్ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు. ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర జట్టు మేనేజర్ ఎంవీఆర్ రాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుజోరియో కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు సత్తి వేణుమాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు బండి రాంబాబు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్ క్రీడాకారులను అభినందించారు. -
రూపే కార్డుతో రూ.2లక్షల ప్రమాదబీమా
నిడదవోలు : రూపే కార్డులతో 40 రోజుల్లో కనీసం ఒక్కసారైనా సొమ్ము లావాదేవీలు జరిపితే ఖాతాదారులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆంధ్రాబ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కారే భాస్కరరావు చెప్పారు. పట్టణంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 118 ఆంధ్రాబ్యాంక్ శాఖల ద్వారా కోటి రూపే కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో తమ బ్యాంక్ ద్వారా రూ. 7,620 కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు. త్వరలో గణపరం మండలం పిప్పరలో ఆంధ్రాబ్యాంక్ నవశక్తి శాఖను ప్రారంభించనున్నామన్నారు. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు 2 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో త్వరలో బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ సీనియర్ మేనేజర్ పి.దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారిణికి చేయూత
నిడదవోలు : అథ్లెటిక్ పోటీల్లో రాణిస్తున్న పేద క్రీడాకారిణి యాతం నాగాంజలికి చేయూత నందించేందుకు థింకర్స్ కార్నర్ అనే సంస్థ ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 26న ’సాక్షి’లో ‘పేదింట పరుగుల రాణి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. గురువారం బాలికల జూనియర్ కళాశాలలో నాగాంజలికి రూ.17,000 ఆర్థిక సహాయం అందించారు. ప్రిన్సిపల్ పి.సరళ, ఎ¯ŒS.సుజల, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.నాగరాజు పాల్గొన్నారు.