సక్రమంగా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం
Published Sun, Dec 18 2016 11:23 PM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం ఆస్తులపై సమగ్ర విచారణ జరిపి, వేలం ప్రక్రియను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేష¯ŒS రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముప్పాళ్లతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం సిటీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ మాట్లాడారు.
బాధితుల ఆత్మహత్యలు నిరోధించడానికి రూ.1,100 కోట్లు తక్షణం అడ్వాన్సుగా ఇవ్వాలని చెబుతూ, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కాపాడాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ముకాయడం సమంజసం కాదన్నారు. 99 మందికి పైగా బాధితులు చనిపోయినా పాలకులకు పట్టడం లేదని దుయ్యబట్టారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ బస్సుయాత్ర నిర్వహించి, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయించే అధికారం హైకోర్టు ఇచ్చినందున వేలం ప్రక్రియను వేగవంతం చేసి, వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ బాధితులకు అండగా నిలవాలని కోరారు. సీఐడీ వద్ద ఉన్న అగ్రిగోల్డ్ ఖాతాదారుల వివరాలను తక్షణమే ఆ¯ŒSలై¯ŒSలో పెట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈ.మాలకొండయ్య, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, సంఘ రాష్ట్ర కోశాధికారి జి.శేషగిరిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శేషుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే..
∙ ఇప్పటి వరకూ ప్రభుత్వం కానీ, సీఐడీ కానీ అటాచ్ చేసిన ఆస్తుల వివరాలు, వాటి విలువలు రికార్డు పూర్వకంగా తెలియజేయాలి.
∙ అన్ని జిల్లాల్లోని వెంచర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి.. ముందుచెప్పిన విధంగా వాటిని డెవలప్‌మెంట్ చేసి స్వాధీనపర్చాలి.
∙ అగ్రిగోల్డ్ ఆర్థిక కుంభకోణానికి బలై మరణించిన ఖాతాదారులు, ఏజెంట్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి.
Advertisement
Advertisement