Published
Sun, Feb 19 2017 11:43 PM
| Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
తీరంలో సన్‌డే సందడి..
బాపట్ల..వేసవి సమీపించటం...ఆదివారం కావటంతో సూర్యలంక తీరంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. సముద్ర స్నానాలకు వచ్చేవారితో తీరంలో సందడి నెలకొంది. సూర్యలంక సముద్రతీరం స్నానాలకు అనుకూలమైన ప్రదేశం కావటంతో గుంటూరు , కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. పలువురు పర్యాటకులు ఇక్కడే వంటా వార్పు చేసుకుని బంధుమిత్రులతో భోజనాలు చేసి సరదాగా గడిపారు. అడవి పంచాయతీ అధికారులు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.