persons
-
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్‌నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్‌ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్‌ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
ప్రపంచంలోని టాప్ 10 శ్రీమంతులు వీరే
-
AP: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది. -
నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే...
ఆరిలోవ (విశాఖ తూర్పు): రోజంతా తల్లితో సరదాగా గడిపాడు. సాయంత్రం అన్నయ్యతో కలిసి ఆడుకున్నాడు. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారనుకుని సంబరపడిన ఆ తల్లికి ఒక్కసారిగా షాక్ తగిలింది. తన చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. జీవీఎంసీ 13వ వార్డు పరిధి విశాఖ కేంద్ర కారాగారం పక్కన శ్రీకృష్ణాపురంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... ఈ కాలనీలో గుబ్బల నాగమణి కొన్నాళ్లుగా ఇద్దరు కుమారులతో భర్తకు దూరంగా నివాసముంటుంది. పెద్ద కుమారుడు(4), చిన్న కుమారుడు(2) తల్లితోపాటు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఇంట్లోనే ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. ఆటాడుతుండగా చిన్న కుమారుడు గగన్(2)కు ఓ మేకు దొరికింది. ఆ మేకును తీసుకెళ్లి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులో పెట్టడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడి తల్లి గమనించి స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దారిలోనే ప్రాణాలు విడిచిపెట్టడంతో తిరిగి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అంతవరకు సరదాగా ఆడుకొన్న తన కుమారుడు మృతి చెందడంతో నాగమణి కన్నీటిపర్యంతమైంది. ఆమె వేదన స్థానికులను కంటితడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసుల కేసు నమోదు చేశారు. భర్త, పిల్లలు కళ్లెదుటే... పీఎం పాలెం (భీమిలి): మారికవలస కూడలికి సమీపంలోని పెట్రోలు బంకుకు ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ వివాహిత ప్రమాద స్థలిలోనే ప్రాణాలు విడిచింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు, భార్య స్వర్ణ(30) కుటుంబంతో ఉద్యోగరీత్యా సబ్బవరంలో నివసిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగులే. అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భార్య స్వర్ణ వీఎంఆర్డీఏ ఉద్యోగి. ప్రస్తుతం వుడా పార్కులో టికెట్ బుకింగ్ కౌంటర్లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బుడతనాపల్లి నుంచి నగరంలోని ఆరిలోవలో అత్తవారింటికి భార్య స్వర్ణ, కుమారుడు(4), కుమార్తె(8), అంతే వయసున్న అన్న కూమార్తెతో అర్జునరావు బైక్‌పై బయలుదేరాడు. వీరు మారికవలస కూడలికి సమీపంలో పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న స్వర్ణ పడిపోగా ఆమె పైనుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించింది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో పిల్లలిద్దరూ షాక్‌కు గురయ్యారు. పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త అర్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. దూసుకొచ్చిన మృత్యుదేవత పెదవాల్తేరు (విశాఖ తూర్పు): లారీ బ్రేకులు ఫెయిలై మృత్యుదేవతలా దూసుకొచ్చి యువకుడి ప్రాణాలు బలిగొంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవాల్తేరు అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న అత్తోట కన్నా వెంకటరత్నం ఇద్దరు కుమారులతో కలిసి నేతాజీవీధిలో నివసిస్తున్నారు. చినవాల్తేరులో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె, చిన్న కుమారుడు కనకరాము (32) కనకమహాలక్ష్మి అమ్మవారి మాల ధరించారు. కుమారుడు వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జరిగిన హోమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటరత్నం ఆలయంలో వుండిపోగా, కనకరాము నేతాజీవీధిలో గల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. ఇంతలో ఓ క్వారీ లారీ చినవాల్తేరు పాత సీబీఐ డౌన్ మీదుగా నేతాజీవీధివైపు వస్తూ బ్రేకులు ఫెయిలవ్వడంతో అతివేగంగా దూసుకొచ్చింది. గమనించిన పాదచారులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కనకరాము కూడా కాలువ మీదకు వెళ్లిపోయినా అప్పటికే లారీ బలంగా ఢీకొనడంతో శరీరంపై పెద్ద గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీకి, కాలువకు మధ్య కనకరాము ఇరుక్కుపోయి మరణించడం స్థానికులను కలిచివేసింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్లలోంచి భయాందోళనలతో బయటకి వచ్చారు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు, త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ట్రాఫిక్ ఎస్ఐ అసిరి తాత, త్రీటౌన్ ఎస్ఐలు జె.ధర్మేంద్ర, హరీష్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. డ్రైవర్ దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసుని త్రీటౌన్ సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: గ్రామగ్రామానికీ ఇంటర్నెట్ ) -
అయినవారు అపరిచితులు.. ఆ నలుగురే శ్మశాన బంధువులు
భువనేశ్వర్: కరోనా భయంతో అయిన వారంతా అపరిచితులుగా మారారు. ఆత్మీయత, మమతానురాగాల్ని కరోనా సమాధి చేసింది. కోవిడ్ చికిత్స పొందుతూ కన్నుమూసిన వారి మృతదేహాల చెంతకు కుటుంబసభ్యులు సైతం రావడంలేదు. అంత్యక్రియలకు వెళితే, తమ ప్రాణాలకు అంతిమయాత్ర మొదలైనట్లేనన్న భావనతో మృతదేహాల్ని అనాథలుగా విడిచి పెట్టేస్తున్నారు. సంస్కారవంతంగా మృతదేహాల్ని కడతేర్చాల్సిన సభ్యసమాజం కరోనా వైపరీత్యంతో అమానుషంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అంత్యక్రియలకు దూరమైన వారు అస్తికల నిమజ్జనం వంటి మోక్ష ప్రాప్తి కార్యకలాపాల్ని కూడా నిరాకరిస్తున్నారు. కరోనా మలివిడత సంక్రమణ ఇటువంటి విచారకర పరిస్థితుల్ని ఆవిష్కరించింది. సుందరగడ్ ప్రాంతంలో కరోనా బలిగొన్న వారిలో 400 మృతదేహాలు అనాథశవాలుగా మిగిలిపోయాయి. శ్మశాన్ బంధు కార్యకర్తలు ఈ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అస్తికలల భస్మం తీసుకెళ్లేందుకు కూడ 76 మంది నిరాకరించారు. మీడియాలో ప్రసారం కావడంతో 38 మంది కోవిడ్ అనాథశవాలకు చెందిన బంధువర్గం స్పందించారు. సంబంధిత మృతుల భస్మ కలశాల్ని తీసుకెళ్లగా, మిగిలిన 38 మంది అభాగ్యుల భస్మ కలశాలు శ్మశాన్ బంధు కార్యకర్తల అధీనంలో ఉండిపోయాయి. వీరి భస్మం పుణ్యనదుల్లో నిమజ్జనం చేసేందుకు శ్మశాన్ బంధువర్గం నడుం బిగించింది. సామూహిక నిమజ్జనం సుందరగడ్ రాణీ బగీచా శ్మశాన వాటికలో అయిన వారు నిరాకరించిన మృతుల ఆత్మ మోక్షానికి సామూహిక నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. శాస్త్రీయ రీతుల్లో మంత్రోచ్ఛరణ నడుమ 38 మంది దివంగతుల హస్త భస్మ కలశాలకు పూజాదులు చేపట్టి త్రివేణి సంగమంలో నిమజ్జనం చేసేందుకు అలహబాద్ (ప్రయాగ) బయల్దేరారు. ఈ నెల 3న త్రివేణి సంగమంలో సామూహికంగా హస్తికల్ని నిమజ్జనం చేస్తారు. శ్మశాన బంధువర్గం సిద్ధాంత పండా, మనోజ్ త్రిపాఠి, శిశిర్ బెహరా, కమలేష్ నథాని ఈ నలుగురు శ్మశాన బంధువర్గంగా ఆవిర్భవించారు. ఆ నలుగురు వందలాది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించి మానవీయ విలువల పరిరక్షణకు పట్టంకట్టారు. కరోనా మలివిడత విజృంభణ పురస్కరించుకుని ఈ ఏడాది ఏప్రిల్ నెల 14 నుంచి జూన్ ఆఖరు వరకు సుందరగడ్ ప్రాంతంలో 282 కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. 76 మంది కోవిడ్ మృతుల బంధువర్గాలు కరోనా సంక్రమణ భయంతో ఆస్పత్రి లేదా శ్మశానవాటికలో విడిచి అపరిచితులుగా దూరం అయ్యారు. ఫోనుద్వారా సంప్రదించడంతో సగం మంది స్పందించగా మిగిలిన సగంమంది ఆత్మశాంతికి హిందూ ధర్మం ప్రకారం అస్తికల భస్మం కార్యక్రమం కూడ ముగించారు. -
డబ్బులు డబుల్ చేస్తామని బురిడీ
సాక్షి, చౌటుప్పల్: ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. రెండు వేల నోట్లు రెండిస్తే వాటిని నాలుగు చేస్తానని చెప్పి ఓ వ్యక్తికి నిజంగానే ఇచ్చారు. దాంతో ఆ అమాయకుడికి మరింత ఆశ పుట్టింది. దానిని ఆసరాగా చేసుకున్న నిందితులు ఆ అమాయకుడి నుంచి రూ.12 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో చాకచక్యంగా నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన షేక్ సైదా (33) వృత్తి రీత్యా బండరాళ్లు కొట్టి జీవనం సాగిస్తుంటాడు.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం తుర్కపాలెం(జింకలపాలెం) గ్రామంలో స్థిరపడ్డాడు. ఇదే గ్రామానికే చెందిన షేక్ చిన్నవలీ, ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వరపల్ల గ్రామానికి చెందిన షేక్ బాషా వరసకు అన్నదమ్ములు. వీరిలో షేక్ బాషా రకరకాల మోసాలకు పాల్పడుతుంటాడు. చిన్నవలీ ద్వారా షేక్ సైదాకు షేక్ బాషా పరిచయమయ్యాడు. మీరు పొద్దంతా కష్టపడినా పెద్దగా డబ్బులు రావడంలేదని, తనను నమ్ముకుంటే తొందరగా డబ్బులు సంపాదించవచ్చని బాషా ఆశ కల్పించాడు.దీంతో ముగ్గురూ ముఠాగా ఏర్పడ్డారు. మొదట కైతాపురం గ్రామంలో మోసాలు చేయడం మొదలు పెట్టారు. కైతాపురానికి మార్చిన మకాం.. ముగ్గురు నిందితుల్లో ఒకడైన షేక్ సైదా గత రెండేళ్ల క్రితం మండల పరిధిలోని కైతాపురం గ్రామానికి వలస వచ్చాడు. బండరాళ్లు కొడుతూ జీవించాడు. రెండు నెలల క్రితం తుర్కపాలెం వెళ్లిపోయాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. దాంతో షేక్ చిన్నవలీ, షేక్ బాషాతో కలిసి సైదా ఇటీవల మళ్లీ తిరిగి కైతాపురం వచ్చాడు. గ్రామంలో ఎవరిని సులువుగా మోసం చేయొచ్చో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకున్న పాత పరిచయాల ప్రకారం ఓ వ్యక్తిని గుర్తించాడు. రెండు నోట్లను నాలుగు చేస్తామని... నిందితులు కైతాపురం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చారు. తమకు రెండు వేల రూపాయల నోట్లు రెండు ఇస్తే వాటిని నాలుగు చేస్తామని, అవి ఎక్కడైనా చెల్లుతాయని నమ్మబలికారు. దీనికి అంగీకరించిన ఐలయ్య తన వద్ద ఉన్న రెండు రెండు వేల రూపాయల నోట్లను వారికి ఇచ్చాడు. ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లి కొన్ని రకాల రసాయన ద్రావణాలు నోట్లపై వేయాల్సి ఉందని చెప్పి నిందితులు లోనికి వెళ్లారు. కొంత సేపటి తర్వాత బయటకు వచ్చి నాలుగు నోట్లను ఐలయ్యకు ఇచ్చారు. దాంతో ఐలయ్య మరుసటి రోజు ఆ నాలుగు నోట్లను తీసుకొని చౌటుప్పల్‌లోని ఓ బ్యాంకులోని తన ఖాతాలో వేశాడు. దాంతో అవి ఎకౌంట్లో జమయ్యాయి. అనంతరం ఐలయ్య నిందితుల మాట నిజమని నమ్మాడు. రూ. 12 లక్షల సేకరణ రెండు నోట్లను నాలుగు చేయడంతో ఐలయ్యకు ఆశ ఎక్కువైంది. దాంతో నిందితులు 30 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొస్తే వాటిని రెండింతలు చేస్తామని ఐలయ్యకు చెప్పారు. పూర్తిగా రెండు వేల నోట్లే తేవాలని సూచించారు. సరేనన్న ఐలయ్య బంధువులు, మిత్రుల వద్ద రూ.12 లక్షలు సేకరించి నిందితులకు సమాచారం అందించాడు. దాంతో వారు ఈనెల 21న ఐలయ్య ఇంటికి వచ్చారు. రూ. 12 లక్షలు తీసుకొని ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లారు. నగదు తీసుకొని రెండు వేల నోటు సైజులో ఉన్న నల్ల రంగుకాగితాలను మరో బ్యాగులో చుట్టి ఇచ్చారు. రసాయన ద్రావణాలు వేసినందున బ్యాగులోని కట్టలను రెండు రోజుల తర్వాత తెరవాలని సూచించి వెళ్లిపోయారు. కానీ ఐలయ్య మరుసటి రోజే బ్యాగును తెరిచిచూశాడు. బ్యాగులో ఉన్న కాగితాలను చూసి నెత్తీనోరు కొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల స్వగ్రామాలపై నిఘా పెట్టారు. ఇవేమీ తెలియని నిందితుల్లో ఒకడైన షేక్ సైదా ఈనెల 27న రాత్రి 10 గంటల సమయంలో చౌటుప్పల్ మండలంలోని వలిగొండ రోడ్డు వద్ద బస్సు దిగాడు. రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరింతగా విచారించగా చేసిన మోసం ఒప్పుకున్నాడు. ఇతని వద్ద 12 లక్షల రూపాయల నగదు, నల్లరంగు పూసిన కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. షేక్ బాషా, షేక్ చిన్నవలీలు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ, హోంగార్డు ఊడుగు సైదులును అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేపాల్‌ను వర్షాలు, వరదలతో అతలాకుతలం
-
తీరంలో సన్డే సందడి..
బాపట్ల..వేసవి సమీపించటం...ఆదివారం కావటంతో సూర్యలంక తీరంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. సముద్ర స్నానాలకు వచ్చేవారితో తీరంలో సందడి నెలకొంది. సూర్యలంక సముద్రతీరం స్నానాలకు అనుకూలమైన ప్రదేశం కావటంతో గుంటూరు , కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. పలువురు పర్యాటకులు ఇక్కడే వంటా వార్పు చేసుకుని బంధుమిత్రులతో భోజనాలు చేసి సరదాగా గడిపారు. అడవి పంచాయతీ అధికారులు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
‘ఇంటి’గుట్టు రట్టు!
తాడేపల్లిగూడెం రూరల్ : ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇప్పిస్తామంటూ పలువురు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముంటున్న పలువురు పేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి ఇంటి స్థలం ఉంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ యడల సత్యనారాయణరాజుతో పాటు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్‌లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వంగా సంజీవ వరప్రసాద్, ప్రైవేట్ సర్వేయర్ షేక్ రామ్కఫిర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులు పేదల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా వ్యాపించి చివరకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెవిన పడటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ బీహెచ్ సంగీతరావు, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘరానా మోసగాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎంత మంది మోసపోయారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసి ఉంది. కాగా, నిందితులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. కల్లబొల్లి మాటలు నమొ్మద్దు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమొ్మద్దని మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ సూచించారు. బాధితులు ఎంత మంది ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. చీటింగ్ కేసు నమోదు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ యడాల సత్యనారాయణరాజు, వంగా సంజీవ వరప్రసాద్, షేక్ రామ్ కఫీర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులపై బాధితుడు పైడికొండల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఉసూరుమనిపించారు ఇంటి నిర్మాణానికి రుణం కోసం దరఖాస్తు చేశా. రుణం మంజూరైంది బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థలం పట్టా, రూ.వెయ్యి తీసుకుని రమ్మన్నారు. తీరా అన్ని తీసుకుని వచ్చే సరికి ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది. రుణం మంజూ రైందని ఎంతో సంతోషించా...అంతలోనే ఆనందం ఆవిరైపోయింది. – కొండే వెంకాయమ్మ -
100కోట్లు తాగేశారు
-
బధిరుల ప్రతిభ అభినందనీయం
నన్నయ వీసీ ముత్యాలునాయుడు ముగిసిన బధిరుల వారోత్సవాలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : బ«ధిరులు అసమాన ప్రతిభ కలిగి ఉన్నారని, ఎవరికీ తీసిపోని విధంగా ముందుకు దూసుకెళ్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. స్థానిక ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం రాత్రి ప్రపంచ బధిరుల వారోత్సవాల ముగింపు వేడుక జరిగింది. ముఖ్యఅతిథి వీసీ ముత్యాలునాయుడు మాట్లాడుతూ బధిరులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ పాఠశాల కరస్పాండెంట్ స్వప్న అభినందనీయురాలన్నారు. త్రీటౌన్ సీఐ రామకోటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం బధిర విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా టీచర్ అన్నపూర్ణ నేతృత్వంలో బధిరులు చేసిన యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అతిథులు ఉపన్యాసాన్ని ప్రత్యేక ఉపాధ్యాయురాలు ఆశాలత.. బధిర విద్యార్థులకు మూగభాషలో(సైన్లాంగ్వేజ్) వివరించారు. రామ్‌సాయి కనస్ట్ర„ý న్స్ అధినేత గోకులం రవి, రమాదేవి, ఎలిషా రాజ్‌కుమార్, శాంతి, నాగలక్ష్మీ, ప్రేమలత, బాలు, నిర్మలపాల్గొన్నారు. -
సాహస వీరులు.. మత్స్యకారులు
13 మంది ప్రాణాలను కాపాడిన తీరు.. నేలకొండపల్లి/ తిరుమలాయపాలెం: ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. అప్పుడే మత్స్యకారులు వలలు పట్టుకొని చేపలవేటకు బయల్దేరారు. చిమ్మచీకట్లు అలుముకొని ఉన్నాయి. నాయకన్‌గూడెం వంతెనపై రెండు బస్సులు ప్రమాదానికి గురై కనిపించాయి. మత్స్యకారులు అక్కడికి వెళ్లారు. ఎవరికీ హాని జరగలేదని నిర్దారించుకొని చేపల వేట కోసం వెనుదిరిగారు. అంతలోనే హైదరాబాద్ మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వచ్చి కాల్వలో పడిపోవడంతో పెద్దశబ్దం వచ్చింది. వెంటనే మత్స్యకారులు వెనుదిరిగి వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి టార్చిలైట్ల వెలుగులో కాల్వలో వెతకడం ప్రారంభించారు. తీవ్రగాయాల పాలైన 13 మందిని బయటకు తీసి వైద్యం కోసం తరలించి ప్రాణాలు కాపాడారు. క్షతగాత్రులను బయటకు తీసేందుకు బస్సు అద్దాలను పగులగొట్టే ప్రయత్నంలో మత్స్యకారులకూ గాయాలయ్యాయి. మత్స్యకారులు లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని కూడా బయటకు తీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. మత్స్యకారులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అభినందించారు. మత్స్యకారులు కాపాడటం వల్లనే తమ ప్రాణాలు దక్కాయని పలువురు క్షతగాత్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
16వ రోజు @ 824మంది
కొనసాగిన కానిస్టేబుల్ శారీరక దారుఢ్య పరీక్షలు ఖమ్మంక్రైం: పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఖమ్మంలో నిర్వహిస్తున్న శారీరక సామర్థ్య పరీక్షలు 16వ రోజైన మంగళవారం కొనసాగాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ షానవాజ్‌ఖాసీం పర్యవేక్షణలో ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 1200మంది అభ్యర్థులకు గాను 824మంది హాజరయ్యారు. బయోమెట్రిక్, అభ్యర్థుల ఆదార్‌కార్డు, సర్టిఫికెట్లను పరిశీలించి, ఎత్తులో అర్హత సాధించిన వారిని 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ పోటీలకు అనుమతించారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, రాజేష్, ఏఆర్ డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
పైడిపెల్లిలో రౌడీషీటర్ హత్య
15 రోజుల క్రితం పైడిపల్లిలో ఘటన కుళ్లిపోయిన మృతదేహం పోలీసులకు సమాచారం ఇచ్చిన సోదరి హతుడు తొమ్మిది కేసుల్లో నిందితుడు వెల్గటూరు : ‘కత్తిపట్టినోడు కత్తితోనే పోతాడు.. గన్ను పట్టినోడు గన్నుతోనే హతమవుతాడు’ అన్నట్లు రెండు దశాబ్దాలుగా నేర చరిత్ర ఉన్న ఓ రౌడీషీటర్ చివరకు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పెద్దపెల్లి సీఐ మహేశ్ కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన ఎనగందుల తిరుపతి ఓ రౌడీషీటర్. గ్రామంలో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇటీవల ఏకాదశి పండుగకు ధర్మపురి మండలం భీర్పూర్ గ్రామంలో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లాడు. అక్కడే ఒకరోజు ఉండి తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఎవ్వరికీ కనిపించడంలేదు. ఇతడి చెల్లెలు లీలావతి రాజారాంపల్లి గ్రామంలో ఉంటోంది. ఆమె కొద్ది రోజులుగా తిరుపతికి ఫోన్ చేస్తుండగా స్విచ్ఆఫ్ వస్తోంది.ఈక్రమంలో అనుమానం వచ్చిన లీలావతి సోమవారం పైడిపెల్లిలోని తిరుపతి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. పరిసరాలన్నీ దుర్వాసన వస్తున్నాయి. అనుమానం వచ్చి వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై అంజయ్య సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సమక్షంలో ఇంటి తలుపులు తెరిపించాడు. లోనికి వెళ్లి చూడగా తిరుపతి శవమై కనిపించాడు. శవం పూర్తిగా కుళ్లి పోయింది. ఎముకలు చర్మం మాత్రమే ఉంది. ముందు రూములో రక్తపు మరకలు ఉన్నాయి. శరీరంపై అండర్వేర్ మాత్రమే ఉంది. లుంగీ మరోచోట పడిఉంది. ఇంట్లో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు తిరుపతిని హత్యచేసి ఉంటారని భావిస్తున్నట్లు సీఐ తెలిపారు. తిరుపతిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. వీటిలో ఒకటి వరకట్నం కోసం భార్యను హత్య చేయగా, మరోటి జంట హత్య కేసు. పలు దాడి కేసుల్లోనూ తిరుపతి నిందితుడు. దీంతో 2007లో వెల్గటూరు పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. తిరుపతి జీవితం ఆ ద్యంతం వివాదాస్పదంగా ఉండగా, చివరికి అతడి మర్డర్ కూడా మిస్టరీగానే జరిగింది. తిరుపతి మృతుడి రెండో భార్య వనిత ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్, ఎస్సై అంజయ్య తెలిపారు. -
స్పోర్ట్స్ హీరోస్ స్పెషల్ సాంగ్
-
అమ్మ అనాథయ్యింది!
నవమాసాలూ మోసింది..కంటికి రెప్పలా కాపాడింది. తాను పస్తులుండి పెంచి పెద్దవాళ్లను చేసింది.. ప్రేమనిచ్చిన పెనిమిటి దూరమయ్యాడని మతిపోయిన ఆ అమ్మను బిడ్డలు అనాథను చేశారు. లేవలేని స్థితిలో ఒంటరిని చేశారు. తమకు భారమని బతికుండగానే బస్టాండులో వదిలేశారు. 108 సాయంతో ఆస్పత్రికి చేరిన ఆ తల్లి.. చావుకు దగ్గరై నరకయాతన అనుభవిస్తోంది. - తల్లిని వదిలించుకున్న బిడ్డలు - 15 రోజులుగా మృత్యువుతో పోరాటం - ప్రాణభిక్ష పెట్టాలని వేడుకోలు మదనపల్లె రూరల్ : ఈ వృద్ధురాలి పేరు లక్ష్మీదేవమ్మ(65). ఊరు తెలీయదు. ఎవరో ఇద్దరు వ్యక్తులు 15 రోజుల క్రితం మదనపల్లె బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లారు. లేవలేని స్థితిలో ఆ తల్లి పడుతున్న కష్టాలు చూసి ఓ వ్యక్తి 108కు సమాచారం అందించాడు. స్పందించిన వారు బాధితురాలిని తీసుకొచ్చి ఏరియా ఆస్పత్రి క్రానిక్ వార్డులో వదిలేశారు. 15 రోజులుగా ఆస్పత్రిలో ఆ తల్లి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తోటి రోగులు ఆరా తీయగా ఆమె వచ్చీ రాని మాటలతో ఇలా చెబుతోంది.. తన పేరు లక్ష్మీదేవమ్మ అనీ.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. భర్త 20 సంవత్సరాల క్రితం చనిపోయాడని కన్నీరు పెట్టుకుంది. మతి స్థిమితం కోల్పోవడంతో తను ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పలేక పోతోంది. పిల్లలు పట్టించుకోకపోవడంతోనే ఇలా కష్టాలు పడాల్సి వస్తోందని ఎక్కిళ్లు పెడుతోంది. క్రానిక్ వార్డుకు వచ్చే రోగుల బంధువులు ఆ పండుటాకు దయనీయ స్థితిని చూసి అయ్యో.. పాపం అంటున్నారు. పట్టెడు అన్నం పెట్టడం..శీతల పానీయాలు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. వార్డులో ఆమె అనుభవిస్తున్న ఘోర పరిస్థితుల్ని కళ్లారా చూసి వృద్ధాప్యంలో ఇలా వదేలేసిన పిల్లలను శాపనార్థాలు పెడుతున్నారు. అన్నం, నీళ్లు పెట్టే వారు లేక అలమటిస్తోందని, దాతలు ముందుకొచ్చి ప్రాణభిక్ష పెట్టాలని ఆస్పత్రి సిబ్బంది, సహచర రోగులు కోరుతున్నారు. చావుకు దగ్గరవుతున్న ఈమెను వృద్ధాశ్రమంలో చేర్చాలని వేడుకుంటున్నారు. -
ఆధ్యాత్మిక శిఖరం అమీన్‌పీర్ దర్గా
కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రార్థన చేస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసంతోనే సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు నిత్యం పెద్ద సంఖ్యలో దర్గా సందర్శన కోసం వస్తుంటారు. పెద్ద దర్గాగా అందరికీ సుపరిచితం. నేటి నుంచి 10వ తేదీ వరకు ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో దర్గా కాంతులీనుతున్న దృశ్యమిది. కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ఆ దర్గాలో గురువుల మజార్ల వద్ద కాసేపు ధ్యానంలో కూర్చొని మనసులో ఏం కోరుకున్నా ఫలిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ దర్గాను దర్శించుకునేందుకు సామాన్యుడి నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులు కూడా వస్తుంటారు. విదేశీ భక్తుల విశ్వాసాన్ని కూడా చూరగొన్న కడప పెద్దదర్గా ఆస్తాన్-ఏ-మగ్దూమ్- ఇలాహి సయ్యద్‌షా అమీన్ పీర్ దర్గా జిల్లాలో ఒకానొక ముఖ్య పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. విశిష్ట చరిత్ర ఈ దర్గాకు సంబంధించిన ప్రథమ సూఫీ హజరత్ ఖాజా సయ్యద్‌షా పీరుల్లా మహ్మద్ ఛిఫ్తివుల్ ఖాద్రి నాయబ్-ఏ- రసూల్ కర్నాటకలోని బీదర్ ప్రాంతం నుంచి 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చారు. సూఫీ తత్వాలతో ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచారు. నాటి కడప నవాబు నేక్‌నామ్‌ఖాన్ ఈయనకు ప్రియ శిష్యుడు. ఆయన 1716లో జీవసమాధి అయ్యాక నవాబు ఆయన కోసం ప్రత్యేకంగా మజార్‌ను నిర్మించారు. అదే ప్రస్తుతం అమీన్ పీర్ దర్గాగా విలసిల్లుతోంది. ప్రస్తుతం దర్గా వారసులుగా ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేని సూఫీ సర్ పీఠాధిపతిగా ఉన్నారు. చిన్న వయసులోనే అనేక మతగ్రంథాలను ఆకళింపు చేసుకొని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సాధించిన ఈయన శిష్యకోటికి కొంగుబంగారంలా నిలిచారు. దర్గాపై అపార విశ్వాసం గల భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. నాటి నీలం సంజీవరెడ్డి నుంచి దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, విశ్వ సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ అగ్ర సినీతారలు అమీర్‌ఖాన్, అభిషేక్, ఐశ్వర్యరాయ్బచ్చన్లు, తెలుగు సినీ నటులు తరచూ ఈ దర్గాను దర్శిస్తుంటారు. సేవామార్గం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలేగాక దర్గా ఆధ్వర్యంలో పేద, అనాథ బాలలకు ఆశ్రయం కల్పించి సాధారణ విద్యతోపాటు ఆధునిక, సాంకేతిక వృత్తి విద్యల ను కూడా నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈనెల 5నుంచి నుంచి 10వ తేదీ వరకు ఉరుసు, గంధం, ఇతర ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ కవులతో ముషాయిరా, గాయకులతో ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి తన వాయి ద్య విన్యాసాలతో అలరించనున్నారు. సందడే సందడి ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున దుకాణాలు దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. పిల్లల వినోదం కోసం చేసే ప్రత్యేక ఏర్పాట్లతో ఉరుసు తిరునాలను తలపిస్తుంది. ప్రతిరోజూ రాత్రి 2గంటల వరకు దర్గా ప్రాంగణం భక్తులతో కోలాహలంగా ఉంటుం ది. నగరానికి చెందిన అన్ని మతాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. -
అక్రమార్కులకు కళ్లెం!
పాలమూరు: ఇసుక తరలింపు ఇక ఈజీ కాదు.. అక్రమంగా కొల్లగొట్టేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో పాటు వాహనాన్ని జప్తు చేయనున్నారు. సీజ్చేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ నిర్మాణాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అనుమతుల పేర విచ్చలవిడిగా జరిగే అక్రమ రవాణాను ఎవరు అడ్డుకోవాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇసుకాసురులపై ఏపీఎండీసీ, మైనింగ్‌శాఖల అధికారులు ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తెలివిగా నీరుగారుస్తోంది. జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)ను అనుసంధానం చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అక్రమ రవాణాకు అధికారికంగా గేట్లేత్తేసింది. ప్రభుత్వ నిర్మాణాలు, ప్రాజెక్టులతో పాటు ప్రైవేటు నిర్మాణాలకు సైతం ఇసుక అవసరమన్న సాకుతో ఏపీఎండీసీ ద్వారా ఇసుకను తోడేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ అమలుకు ముందు.. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను రెవెన్యూ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఇసుకను ఒక చోట చేర్చి అక్కడి నుంచి అవసరమైన వారికి ఇసుకను విక్రయించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. జిల్లాలో విజృంభిస్తున్న ఇసుక మాఫీయా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పక్కదారి పట్టించే ప్రయత్నంలో పడ్డారు. సర్కారు కొత్త నిర్ణయంతో ఇసుక విక్రయం పక్కదారి పడుతుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ డిపో ద్వారా ఇసుక సరఫరా: కలెక్టర్ అక్రమ రవాణా, అక్రమ తవ్వకాల్లో జప్తుచేసిన ఇసుకను జిల్లా కేంద్రంలోని డిపో ద్వారా అవసరమున్న వ్యక్తులు, సంస్థలకు, ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు సరఫరా చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ టీకే శ్రీదేవి వెల్లడించారు. అన్ని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటిగా కేటాయింపు పద్ధతిలో ఒక క్యూబిక్ మీటరును రూ.750 చొప్పున విక్రయిస్తారని, పెద్దమందడి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇసుకను మొదటగా ప్రభుత్వమే జిల్లా కేంద్రానికి సమీపంలోని నిర్మితి కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. ఒక దరఖాస్తుపై 50 క్యూబిక్ మీటర్ల ఇసుక కేటాయిస్తారని, ఆ ఇసుకను తీసుకున్న తర్వాత ఇంకా అవసరమైతే మళ్లీ 50 క్యూబిక్ మీటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారుని అవసరాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఏడీ మైన్స్, జియాలజీ విభాగాలు ఇసుక కే0టాయింపు చేస్తాయన్నారు. కేటాయించిన ఇసుక లబ్ధిదారుడికి నిర్మిత కేంద్రం వద్ద అప్పగిస్తారని కలెక్టర్ వెల్లడించారు. అక్కడి నుంచి నిర్మాణ ప్రాంతానికి దరఖాస్తు దారుడు అతని స్వంత ఖర్చులతో రవాణా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అక్రమరవాణా చేస్తే.. ఇసుక అక్రమ రవాణాకు, అక్రమ వినియోగానికి తరలిస్తే అట్టి ఇసుకను, అందుకు వినియోగించిన వాహనాన్ని రెండింటిని కూడా జప్తు చేసి బహిరంగ వేలంలో విక్రయిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా వాహనం డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కేటాయించిన ఇసుక రవాణాను అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణాకు అనుమతిస్తారు. కనుక ఇసుక అవసరం ఉన్నవారు సమీప మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
నందిని ఎత్తుకెళ్లబోయి..
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని మునులపూడి అరుంధతీయవాడలో పురాతన కాలం నాటి నంది విగ్రహం చోరీ చేసి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని విగ్రహంతో సహా నలుగురు వ్యక్తులను పట్టుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో బుధవారం అర్థరాత్రి కనిగిరి రిజర్వాయర్ చెరువు గట్టు వద్ద దళితవాడ లోని బీరాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఉన్న పురాతన నంది విగ్రహాన్ని అతికష్టం మీద పెకలించి వాహనంలోకి చేర్చారు. నంది విగ్రహం బరువుకు కారు ముందుకు సాగలేకపోయింది. దీంతో డ్రైవర్ ఎక్స్‌లేటర్ గట్టిగా నొక్కేసరికి ఒక్కసారిగా కారు ముందుకు దూకింది. ఈ అలికిడి విన్న మత్స్యకారులు అక్కడికి చేరుకునేలోగా కారు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న తమ బంధువులకు చెప్పేసరికి వారు అప్రమత్తమై వాహనాన్ని గ్రామంలో అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు పరారు కాగా నలుగురు వ్యక్తులు దొరికారు. వారు గ్రామస్తులపై తిరగబడాలని చూడటంతో వారిని పట్టుకుని కొట్టడమే కాకుండా కారును ధ్వసం చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా ఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి నంది విగ్రహం, వాహనంతో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
సాయం కోసం వెళ్లి మృత్యువాత
గుంతకల్లు రూరల్ : సాయం కోసం వెళ్లిన వారు మృత్యువాడ పడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వాసవీ టాకీస్ సమీపంలో ఉన్న మేదరి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఆదివారం ఉదయం సాయం కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేదరి వీధిలో ధనుంజయ గుప్తా అనే వ్యాపారి, మేస్త్రీ హనుమేష్ ద్వారా కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టాడు. ఆదివారం రెండో అంతస్తులో గ్రిల్ పనులు ప్రారంభించారు. గ్రిల్ బరువు ఎక్కువగా ఉండటంతో సహాయం కోసం అక్కడే హమాలీ పని చేసుకుంటున్న రాముడు(50), అదే సర్కిల్ ఆటో అద్దెకు నడుపుకుంటున్న మారెప్ప(55)ను పిలిచారు. వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు గ్రిల్‌ను పైకి ఎత్తుతుండగా, ప్రమాదవశాత్తూ వెల్డింగ్ మిషన్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో మేస్త్రీ హనుమేష్ ,హమాలీ పెద్దన్న, రాడ్ బైండర్ నాగరాజు, రాముడు, మారెప్ప విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో రాముడు, మారెప్ప అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితుల్ని వెంటనే బస్టాండు సమీపంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అప్పటికే రాముడు, మారెప్ప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త మృతికి ఇంటి యజమానే బాధ్యత వహించాలని రాముడు భార్య సుంకులమ్మ కుటుంబ సభ్యులతో సహా భర్త మృతదేహంతో నిర్మాణంలో ఉన్న ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు కుమారుడు, కూతురు ఉన్నారని, రెండు నె లల్లో కూతురి వివాహం కూడా ఉందని, ఇపుడు ఇలా జరిగిందే.. అంటూ ఆమె బోరున విలపించింది. అనంతరం కొందరు పెద్ద మనుషులు రంగప్రవేశం చేసి ఆందోళన విరమింపజేశారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కట్టకుంటే ఖబడ్దార్
అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్‌లు నోటీసులు డ్వాక్రా మహిళల నుంచి రికవరీకి రంగం సిద్ధం రుణమాఫీ ప్రకటనలో ప్రభుత్వ తాత్సారం ఆందోళన చెందుతున్న రైతులు రుణాల ఉచ్చులో రైతులు, డ్వాక్రా మహిళలు గిలగిల కొట్టుకుంటున్నారు. రుణమాఫీ ఆశతో వారంతా ఆరు నెలల నుంచి చెల్లింపులు ఆపేశారు. రూ. వందల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కుదేలయ్యే ప్రమాదం ముంచుకురావడంతో దానిని అధిగమించేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. రైతులకు నోటీసులు పంపడంతోపాటు అప్పు తీర్చాలంటూ ఫోన్లు చేస్తున్నారు. నర్సీపట్నం/చోడవరం : రుణమాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం తో బ్యాంకులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నా యి. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలం టూ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితితో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. చం ద్రబాబు ప్రకటనతో పాటు కాలం కలిసిరాక ఆరు నెలలుగా రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. జిల్లాలో సుమారు రెండు లక్షల మందికి సంబంధించి రూ.1700 కోట్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంతమేరకు వసూళ్లకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. అప్పు తీర్చాలంటూ నేరుగా రైతులకు ఫోన్లు చేయడంతో పాటు నోటీసులు జారీచేస్తున్నారు. ఉదాహరణకు మాకవరపాలేనికి చెందిన రైతు కోలా బాబూరావు గత ఖరీఫ్‌లో నర్సీపట్నం జాతీయ బ్యాంకు లో రూ. 80వేలు అప్పు తీసుకున్నాడు. ప్రస్తుతం అసలుతో పాటు వడ్డీతో చెల్లించాల్సి ఉంది. గతేడాది కాలం కలిసి రాకపోవడంతో బకాయి చెల్లించలేదు. రుణం తీసుకుని ఏడాది పూర్తికావడంతో అధికారులు నోటీసులు జారీచేశారు. అలాగే రోలుగుంట మండలం జానకిరాంపురానికి చెందిన రైతు దేవాడ సత్తిబాబు జాతీయ బ్యాంకులో రూ. 90వేల రుణం తీసుకున్నాడు. రుణమాఫీ అమలు చేస్తారని అప్పు విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో రూ.300కోట్లకు పైబడే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చాయి. మూడు రోజులుగా చోడవరం ఆంధ్రాబ్యాంక్ రైతులకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. బంగారు వస్తువులపై తీసుకున్న పంట రుణాలు నెలాఖరులోగా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ బ్యాంక్ 200 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇదే తరహాలో మిగతా కమర్షియల్ బ్యాంక్‌లు కూడా బకాయి ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. మరో పక్క వెంటనే పంట రుణాన్ని చెల్లించాలంటూ యూనియన్‌బ్యాంక్ రైతులకు సెల్ ఫోన్లలో మెసేజ్‌లతో ఒత్తిడి తెస్తోంది. ఇక నిత్యం రైతులతో మమేకమయ్యే డీసీసీబీ బ్యాంక్‌లు కూడా పరోక్షంగా తమ సిబ్బందితో రైతులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుమాఫీ చేయకపోతే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా రూ. 521 కోట్ల రుణాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకు లు సన్నద్ధమయ్యాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి కనీసం రూ. లక్ష వరకు అప్పు ఉంటుందని బ్యాంకర్ల అంచనా. -
వేసవి మోత విద్యుత్ కోత
అనధికారిక కోతలతో సిటీజనులకు ఇక్కట్లు దోమల మోతతో కునుకు కరువు కాలిపోతున్న ఫ్రిజ్‌లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఊపందుకున్న ఇన్వర్టర్ల విక్రయాలు సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఇష్టం వచ్చినట్లు కోతలు అమలవుతున్నాయి. అసలే వేసవి.. పైగా పరీక్షల సమయం.. అయినా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు అమలు చేస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటల పాటు కోతలు అమలు చేస్తామని అధికారికంగా ప్రకటించిన సీపీడీసీఎల్.. ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా మరో మూడు గంటలు కరెంటు కట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు పగటి పూటకే పరిమితమైన ఈ కోతలు... తాజాగా విద్యార్థులు చదువుకునే కీలకమైన రాత్రి సమయంలోనూ అమలు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 48 మిలియన్ యూనిట్లు అవసరం ప్రస్తుతం గ్రేటర్ వాసుల అవసరాలు తీర్చాలంటే ప్రతి రోజూ కనీసం 48 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా.. 43 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావడం లేదు. ఫలితంగా కోతలు తప్పవని ప్రకటించిన సీపీడీ సీఎల్... ఆ మాటకైనా కట్టుబడి ఉండటం లేదు. ఉదాహరణకు మెహిదీపట్నం, అజామాబాద్, గ్రీన్‌ల్యాండ్స్, రాజేంద్రనగర్, చంపాపేట్ డి విజన్లలో ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 5 నుంచి 6.30 గంటల వరకు అధికారిక కోతలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అనధికారికంగా ఇక్కడ మరో మూడు గంటలు కోత విధిస్తోంది. అలాగే బేగంబజార్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, హబ్సిగూడ, మేడ్చల్ డివిజన్ల పరిధిలో ఉదయం 9.30 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తున్నట్లు చెప్పినా.. అనధికారికంగా మరో రెండు గంటలు కట్ చేస్తోంది. కనీసం రాత్రి పూటైన ప్రశాంతంగా నిద్రపోదామని భావించే వారికి ఆ భాగ్యం దక్కనీయడం లేదు. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడే మొదలైన ఉక్కపోతకు దోమలు కూడా తోడవుతున్నాయి. ఈ సమయంలో ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పనిచేయక పోవడంతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమయం సందర్భం లేకుండా ఎడాపెడా కరెంట్‌ను కట్ చేస్తుండటంతో ఇంట్లో విలువైన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ యంత్రాలు కాలిపోతున్నాయి. ఈ విషయంపై సమీపంలోని అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోవ డం లేదు. ఈ కోతలను తట్టుకోలేక కొంతమంది తల్లితండ్రులు ముందస్తు జాగ్రత్త కోసం ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తుండటంతో ఇటీవ ల వీటి విక్రయాలు ఊపందుకున్నాయి. సంక్షోభం దిశగా పరిశ్రమలు వరుస ఆందోళనలతో అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలు.. తాజా అధికారిక సెలవులతో మరిన్ని నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఆర్డర్లు చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు ఇంతకాలం వాటినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్న కార్మికుల జీవితాలు మళ్లీ రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉండనుందోనని యజమానులతో పాటు కార్మికులూ ఆందోళన చెందుతున్నారు. మంత్రుల క్వార్టర్స్‌కు కరెంట్ కట్ బిల్లు కట్టలేదనే నేపంతో ఇటీవల గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన డిస్కం.. తాజాగా ఇదే కారణంతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మంత్రుల నివాస సముదాయానికి బుధవారం విద్యుత్ సరఫరా నిలిపి వేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్వార్టర్లకు కరెంటు లేకపోవడంతో మాజీ మంత్రుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ సముదాయం రెండు మాసాల కాలానికి రూ.24 లక్షలు బకాయిపడింది. మూడుసార్లు నోటీసులిచ్చినా ఆర్అండ్బి అధికారులు స్పందించలేదు. దీంతో ఫిలింనగర్ ట్రాన్స్‌కో ఏఈ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కరెంటు నిలిపివేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో 8 గంటల తర్వాత కరెంటును పునరుద్ధరించారు. -
దొంగనోట్ల ముద్రణదారుల అరెస్టు
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీసీఎస్ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడకు చెందిన పరపతిరాంరెడ్డి ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ప్రింటింగ్‌లో తనకున్న నైపుణ్యాన్ని వినియోగించుకుని నకిలీ వెయ్యి రూపాయల నోట్లను ముద్రించడంప్రారంభించాడు. విశాఖపట్నం పెద్దవాల్తేరు మండలం ప్రశాంతినగర్ కాలనీకి చెందిన ఎన్నేటి సునీల్‌కుమార్ సహకారంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొంతమంది ద్వారా నకిలీ నోట్ల చెలామణి ప్రారంభించారు. వాటిలో 20 వెయ్యి రూపాయల నోట్లను నరసన్నపేటకు చెందిన కుంచ శ్రీనివాసరావు గత ఏడాది అక్టోబర్‌లో శ్రీకాకుళం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు నగదు డి పాజిట్ మెషిన్ ద్వారా డిపాజిట్ చేశాడు. దీంతో శ్రీనివాసరావుకు ఆ నోట్లు ఇచ్చిన కాకర్ల అనిల్‌కుమార్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వారిద్దరూ ఇచ్చిన సమాచారం ప్రకారం పలాసకు చెందిన అంబటి సంతోష్, ఇంజా విశ్వనాథం, మోహనరావును పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. విశాఖపట్నం నుంచి సునీల్‌కుమార్ ద్వారా రాంరెడ్డి నోట్లను సరఫరాచేస్తున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి వారిపై నిఘా వేసిన శ్రీకాకుళంలో పోలీసులు శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీ కూడలి వద్ద అరెస్టు చేశారు. రాంరెడ్డివద్ద ఉన్న 25 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను, సునీల్‌కుమార్ వద్ద ఐదు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్నే సరఫరా చేశా ఈ సందర్భంగా రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రూ.5 లక్షల నోట్లు ముద్రించానని, వాటిలో కొన్ని సరఫరా చేసి మిగిలినవి కాల్చేశానని చెప్పాడు. సీసీఎస్ సీఐ సోమశేఖర్ మాట్లాడుతూ రాంరెడ్డిపై గతంలో విశాఖపట్నంలో రెండు కేసులు, విజయనగరంలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరిని పట్టుకున్న ఏఎస్సై కృష్ణారావు, హెచ్‌సీ శ్రీనివాసరావు, పీసీ గోవిందరాజుల కృషి అభినందనీయమన్నారు.