బధిరుల ప్రతిభ అభినందనీయం
-
నన్నయ వీసీ ముత్యాలునాయుడు
-
ముగిసిన బధిరుల వారోత్సవాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
బ«ధిరులు అసమాన ప్రతిభ కలిగి ఉన్నారని, ఎవరికీ తీసిపోని విధంగా ముందుకు దూసుకెళ్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. స్థానిక ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం రాత్రి ప్రపంచ బధిరుల వారోత్సవాల ముగింపు వేడుక జరిగింది. ముఖ్యఅతిథి వీసీ ముత్యాలునాయుడు మాట్లాడుతూ బధిరులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ పాఠశాల కరస్పాండెంట్ స్వప్న అభినందనీయురాలన్నారు. త్రీటౌన్ సీఐ రామకోటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం బధిర విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యోగా టీచర్ అన్నపూర్ణ నేతృత్వంలో బధిరులు చేసిన యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అతిథులు ఉపన్యాసాన్ని ప్రత్యేక ఉపాధ్యాయురాలు ఆశాలత.. బధిర విద్యార్థులకు మూగభాషలో(సైన్‌లాంగ్వేజ్) వివరించారు. రామ్‌సాయి కనస్ట్ర„ý న్స్ అధినేత గోకులం రవి, రమాదేవి, ఎలిషా రాజ్‌కుమార్, శాంతి, నాగలక్ష్మీ, ప్రేమలత, బాలు, నిర్మలపాల్గొన్నారు.