హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా
Published Mon, Dec 12 2016 12:02 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
ఆకివీడు : తెలుగు చిత్ర పరిశ్రమ హాలివుడ్ స్థాయికి ఎదిగిందని సినీ, బుల్లితెర నటుడు వి.సాయికిరణ్ అన్నారు. సరిగమ సంగీత పురస్కారాన్ని అందుకునేందుకు ఆకివీడు వచ్చిన ఆయన వైఎస్సార్ సీపీ నాయకుడు అట్లూరి రంగారావు నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక రంగంలో తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో వెలుగొందుతున్నాయని అన్నారు. నువ్వే కావాలి, ప్రేమించు చిత్రాలు, వెంగమాంబ వంటి సీరియళ్లు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. ప్రస్తుతం టీవీ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నానన్నారు. నక్షత్రం, ఏసుక్రీస్తుపై తీస్తున్న తొలికిరణం సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. టీవీ సీరియల్స్‌లో నటించడమే మనస్సుకు తృప్తిగా ఉందన్నారు. పౌరాణికంలో శివుడు పాత్ర పోషించాలని కోరిక ఉందని చెప్పారు. ఇప్పటి వరకూ 30కి పైగా సినిమాల్లో నటించానన్నారు. సమావేశంలో అట్లూరి రంగారావు, మహ్మద్ మదనీ, బొబ్బిలి బంగారయ్య, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement