210 దేశాల్లో సేవలు | services in 210 countries | Sakshi
Sakshi News home page

210 దేశాల్లో సేవలు

Published Sun, Apr 2 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

210 దేశాల్లో సేవలు

210 దేశాల్లో సేవలు

తాళ్లపూడి : జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు డయాలసిస్‌ సేవలు తణుకులో అందజేయడం జరుగుతుందని లయన్స్‌క్లబ్‌ గవర్నర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి అన్నారు. లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద   ఆదివారం ఉచిత మెగా వెద్య శిబిరాన్ని నిర్వహించారు. మండల లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని లయన్స్‌క్లబ్‌ గవర్నర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 210 దేశాల్లో లయన్స్‌క్లబ్‌ సేవలు అందజేస్తున్నారన్నారు. ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. మనదేశంలో 2.40 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 20 కోట్ల మందికి సాయం చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో మధ్యతరగతి ప్రజలకు కేవలం రూ.800కే డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన శ్రీరమా దంత వైద్యశాల, కిమ్స్‌ బొల్లినేని హాస్పటల్, నిడదవోలు శ్రీరాజేశ్వరి లయన్స్‌ కంటి హాస్పటల్‌ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. దంత పరీక్షలు, గుండె వ్యాధులకు ఈసీజీ, ఆర్ధోపెడిక్, న్యూరాలజీ, కిడ్నీ, యూరాలజీ, బీపీ, షుగర్, పక్షవాతం తదితర వ్యాధులకు, కంటి పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో 700 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అందరికీ ఉచితంగా మందులను అందజేశారు. 60 మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందించారు. 10 మందికి  ఆపరేషన్ల కోసం సిఫార్సు చేశారు. మండల లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, చార్టర్‌ ప్రెసిడెంట్‌  మారిన రామూర్తి, వల్లభనేని శ్రీనివాస్, కె.రవికుమార్, పాపారావు నాయుడు, గర్రే వెంకటరత్నం, వి.చంద్రయ్య పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement