భీమవరంలో రీతూవర్మ సందడి
భీమవరంలో రీతూవర్మ సందడి
Published Sun, Oct 2 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
భీమవరం :పట్టణంలో ఆదివారం ‘పెళ్లిచూపులు’ ఫేం సినిమా హీరోయిన్ రీతూవర్మ సందడి చేశారు. స్థానికంగా సిరి వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి షోరూంను ప్రారంభించగా రీతూవర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ విభాగాలను ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి పులపర్తి సత్యవతి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సతీమణి గ్రంధి సత్యరాణి, మునిసిపల్ చైర్మన్ సతీమణి కొటికలపూడి నాగవెంకట సునీత ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ టి.శ్రీరామారావు మొదటి కొనుగోలు చేశారు. షోరూం అధినేతలు ఎం.సురేష్, జి.కిరణ్, కిశోర్, శ్యామ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement