అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్‌ | interdistrict thiefs arrest | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్‌

Published Mon, Dec 5 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

interdistrict thiefs arrest

భీమడోలు : నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి నుంచి డిపాజిట్‌ సొమ్మును కాజేసిన అంతర్‌జిల్లా జేబు దొంగల ముఠాను ఆదివారం సాయంత్రం భీమడోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టే షన్‌ లో ఆదివారం సాయంత్రం ఎస్సై బి.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు అనే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వాసు నడవలేని స్థితిలో ఉండడంతో పలువురు దాతలు వైద్య సహాయం, కుటుంబ ఖర్చుల నిమిత్తం రూ.21 వేల నగదు సాయం అందించారు. అవి పెద్ద నోట్లు కావడంతో వాటిని గత నెల 29న పూళ్ల ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు వాసు వెళ్లాడు. నగదుకు సంబంధించి ఓచర్‌ రాయించుకునే ప్రయత్నంలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్‌ కాలనీకి చెందిన నాగ్లూరి లోకేష్‌లతో పాటు ఆవుల సాయి, అంబటి విలాస్, దంబి రాము రమేష్, అంబటి దుర్గాప్రసాద్‌ల బృందం ఖాతాదారుల్లా బ్యాంకులోకి ప్రవేశించి నడవలేని స్థితిలో ఉన్న వాసు జేబులోంచి చాకచక్యంగా రూ.21 వేలను దొంగించారు. అనంతరం వారు అక్కడి నుంచి జారుకున్నారు. నగదు పోవడంతో ఘొల్లుమన్న వాసు అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా..
వాసు ఫిర్యాదు మేరకు బ్యాంకును పరిశీలించిన పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా జేబు దొంగల ముఠా పనేనని గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆదివారం భీమడోలు రాషీ్టయ్ర రహదారి కొండ్రెడ్డినగర్‌ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించి ఎస్సై బి.వెంకటేశ్వరరావు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో ప్రశ్నించగా వాసుకు చెందిన నగదును కాజేసినట్టు వారు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి భీమడోలు కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు ఎస్సై తెలిపారు. హెచ్‌సీ అమీర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement