లోవ.. భక్తజన తోవ
-
అడుగడుగునా స్తంభించిన ట్రాఫిక్
-
ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు
తుని రూరల్ :
తలుపులమ్మ అమ్మవారిని దర్శించు కునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తగినంతగా లేకపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం కష్టంగా మారడంతో, భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి గదుల లభించని భక్తులు మండుటెండ కారణంగా ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేట్ పాకలు, తోటల్లో భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మకర్తలతో కలసి దేవస్థానం చైర్మ¯ŒS కరపా అప్పారావు వివిధ విభాగాలను పరిశీలించారు. లోవ దేవస్థానానికి భక్తుల ద్వారా రూ.2.99 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇలాఉండగా బెల్టు షాపులను ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొండ దిగువన బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. దీంతో మందుబాబులు రోడ్లపై చిందులు వేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.