lova temple
-
తలుపులమ్మ సన్నిధిలో బొత్స ఝాన్సీ
తునిరూరల్ (తుని) : లోవదేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారిని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, కుమారుడు డాక్టర్ సందీప్‌లు దర్శించుకున్నారు. ఆదివారం దేవస్థానానికి వచ్చిన ఝాన్సీలక్ష్మి, సందీప్‌లకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ముష్టి వెంకటపురుషోత్తమ శర్మ, రాణి సుబ్రహ్మణ్యశర్మ, ప్రధాన అర్చకులు దూలం సత్యనారాయణ, దూలం త్రినాథరావు ఆశీర్వదించారు. ఆలయ, అమ్మవారి చరిత్రలను వివరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, బుల్లెబ్బాయి, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్ గుబ్బల రామకృష్ణ ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
తలుపులమ్మా... నిజం తలుపుతీయమ్మా !
దైవభక్తి కన్నా దేహభక్తి పెరిగితే స్వాహా రాయుళ్లదే రాజ్యం. వీరికి రాజకీయ అండ తోడైతే దేవతనే బేఖాతరు చేసి గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తారు. తలుపులమ్మ లోవలో ఇదే జరుగుతోంది. ఆది నుంచీ వరుస కథనాలతో ‘సాక్షి’ అక్కడ జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేయడంతో స్పందించిన అధికారులకు కూడా అడ్డుతగిలి దర్యాప్తు సాగనివ్వడం లేదు. ‘సాక్షి’ కథనాలతో అక్రమాలు వెలుగులోకి దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు విచారణకు మోకాలొడ్డుతున్న తెలుగు తమ్ముళ్లు ఆదేశాలిచ్చి పది రోజులవుతున్నా ముందుకుపడని అడుగులు కోటి మింగేసినా కప్పదాట్లే సాక్షి ప్రతినిధి, కాకినాడ : తలుపులమ్మ లోవ దేవస్థానంలో అక్రమార్కులకు తెలుగు తమ్ముళ్లు కొమ్ముగాస్తున్నారు. తమ్ముళ్ల అండ చూసుకునే పేట్రేగిపోయి అమ్మవారి ఖజానాకు లక్షల్లో శఠగోపం పెట్టగలిగారు. మూడేళ్లుగా ఆలయంలో దుకాణాల లీజు సొమ్ములు లక్షల్లో జమకాకున్నా పట్టించుకోలేదంటేనే ఏ స్థాయిలో అక్రమార్కులతో కలిసిపోయారో ఇట్టే అర్థమైపోతోంది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు రూ.14 లక్షలతో కొండపైకి వెళ్లే రోడ్డు పనులను ఈఓకు సైతం తెలియకుండా చేపట్టిన వ్యవహారాన్ని ’సాక్షి’ గత నెల 20న పక్క’దారి’పనులు శీర్షికన వెలుగులోకితేగా సూపరింటెండెంట్, వర్క్ ఇ¯ŒSస్పెక్టర్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న ‘కోటిన్నరకు కన్నం’ శీర్షికన దుకాణాల లీజు వ్యవహారాల్లో కోటిపైగా నొక్కేసిన భాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాల నేపథ్యంలో ఇ¯ŒSఛార్జి సూపరింటెండెంట్ ఎస్. శ్రీనివాసరావుపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆలయ ఈఓ చంద్రశేఖరరరావు లేఖ పంపించారు. జిల్లాలోని కొత్తపేట మందపల్లి ఈఓ దేవుళ్లు, రాజమహేంద్రవరం పందిరి మహదేవుడు సత్రం ఈఓ సుబ్రహ్మణ్యం, పెద్దాపురం కాండ్రకోట ఆలయ గ్రేడ్–1 ఈఓ పళ్లంరాజుల్లో ఎవరో ఒకరికి విచారణ బాధ్యతలు అప్పగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది జరిగి పది రోజులవుతున్నా పై నుంచి ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు. ఏమిటా అని ఆరా తీస్తే విచారణాధికారి నియామకం జరగకుండా అధికారపార్టీ పెద్దలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారని తేలింది. అంటే తలుపులమ్మ ఆలయానికి శఠగోపం పెట్టిన అక్రమార్కులతో ఆ నేతలతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనే పరోక్షంగా విచారణే లేకుండా దొడ్డిదారిన సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. కోటిన్నరపైనే స్వాహా... లోవలో దుకాణాల నిర్వహణను దక్కించుకున్న వారు లీజు సొమ్ములు కోటిన్నర నొక్కేశారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వాటిపై నిశితంగా రికార్డులు పరిశీలించాక ఆలయానికి జమకాని సొమ్ము సుమారు కోటి ఏడు లక్షలని తాజాగా లెక్క తేల్చారు. దేవస్థానంలో 2013–14, 2014–15 ఆర్థిక సంవత్సరాలకు సంబం«ధించి దుకాణాల లీజు సొమ్ము జయచేయని వ్యవహారంలో ఇ¯ŒSఛార్జి సూపరింటెండెంట్‌తోపాటు మరో నలుగురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దుకాణాల వేలం హక్కులు దిగువ క్యాడర్లో పనిచేసే అగ్రహారపు శ్రీను, రామచంద్రరావు, లోవరాజు తదితర ఉద్యోగుల బంధువుల పేరుతో ఉన్నాయని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తం వ్యవహారంలో సూపరింటెండెంట్ సహా నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది. దుకాణాల లీజులు ద్వారా ఆలయానికి రూ.1.07 కోట్లు జమచేయాలి. రెండేళ్లవుతున్నా చిల్లిగవ్వ కూడా జమచేయ లేదు. ఈ విషయంపై అంతర్గత విచారణ నిర్వహించగా సస్పెండైన ఉద్యోగికి ఆ సొమ్ము ఇచ్చామని, అతను జమ చేశారో లేదో తమకు తెలియదనే వాదన వినిపించారని తెలిసింది. తాము రశీదు అడిగితే రశీదు అవసరం లేదు...ఏమైనా అయితే చూసుకోవడానికి తాను ఉన్నానంటూ నమ్మబలుకుతూ చివరకు ప్రోనోట్ మాత్రం ఒకటి ఇచ్చారంటూ ఆ నోట్‌ను చూపించారని సమాచారం.ప్రోనోట్ మాట ఎలా ఉన్నా సొమ్ము జమకాని విషయం మాత్రం వాస్తవమేనని నిగ్గు తేలింది. ఈ విషయం తెలుగు తమ్ముళ్ల వద్దకు వెళ్లడంతో దేవస్థానం పరువు బజారున పడిపోతోందనే సాకుతో సమగ్ర విచారణకు ఉన్నతాధికారుల వద్ద ఉన్న పైలుతోపాటు లీజు సొమ్ము జమచేయని వ్యవహారంలో కూడా విచారణ చేపట్టకుండా అడ్డంపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆలయ ఈఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఆలయానికి జమచేయని కోటి ఏడు లక్షల రూపాయలను బాధ్యుల నుంచి వసూలు చేయడానికి వెనుకాడేది లేదన్నారు. ప్రతి పైసా వసూలు చేస్తామని, అడ్డంకులు ఎదురైనా న్యాయపరంగానైనా వసూలు చేస్తామన్నారు. -
లోవ.. భక్తజన తోవ
అడుగడుగునా స్తంభించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు తుని రూరల్ : తలుపులమ్మ అమ్మవారిని దర్శించు కునేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు తగినంతగా లేకపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం కష్టంగా మారడంతో, భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసతి గదుల లభించని భక్తులు మండుటెండ కారణంగా ఆలయ ప్రాంగణంలోని చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేట్ పాకలు, తోటల్లో భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మకర్తలతో కలసి దేవస్థానం చైర్మ¯ŒS కరపా అప్పారావు వివిధ విభాగాలను పరిశీలించారు. లోవ దేవస్థానానికి భక్తుల ద్వారా రూ.2.99 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇలాఉండగా బెల్టు షాపులను ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొండ దిగువన బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. దీంతో మందుబాబులు రోడ్లపై చిందులు వేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఆన్లైన్లో తలుపులమ్మ వివరాలు
తలుపులమ్మ లోవ వెబ్సైట్ ఆవిష్కరణ భక్తుల సూచనలు, సలహాలు, ఫిర్యాదులకు ప్రాధాన్యం తుని రూరల్ : జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి లోవదేవస్థానం వెబ్‌సైట్‌ను చైర్మన్ కరపా అప్పారావు ఆవిష్కరించారు. మంగళవారం దేవస్థానం కార్యాలయంలో ఈఓ ఎస్.చంద్రశేఖర్‌తో కలిసి చైర్మన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తలుపులమ్మలోవ.కం పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమ్మవారి చరిత్ర, ప్రాచూర్యం తెలుసుకోవడంతోపాటు భక్తులనుంచి వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. అమ్మవారి విశిష్టతలు, ప్రత్యేక పూజలు, జాతరోత్సవాలు, శాశ్వత పూజా పథకాలు, శాశ్వత పులిహోర ప్రసాద వినియోగ ప«థకంలో భాగస్వాములయ్యేందుకు విరాళాలు స్వీకరణ వంటి వివరాలు అందుబాటులో ఉంచామన్నారు. ఏవరైనా నేరుగా అమ్మవారి విశేషాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఒకటో తేదీ నుంచి శరన్నవరాత్రులు : శక్తిపీఠాల్లో ఘనంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది నుంచి తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో నిర్వహించాలని నిర్ణయించినట్టు చైర్మన్ అప్పారావు తెలిపారు. అమ్మవారికి అక్టోబర్ ఒక నుంచి 12వ తేదీవరకు రోజుకు ఒక అలంకరణ చేస్తామన్నారు. అదేవిధంగా జగన్నాథగిరి జంక్షన్లో ఉన్న నమూనా ఆలయం, తుని పట్టణం ఫీడర్రోడ్డులో ఉన్న ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తామని వివరించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు యాదాల లోవకృష్ణ, అత్తి అచ్యుతారావు, నల్లాని చక్రవర్తుల వెంకటనారాయణాచార్యులు, కాకర్లపూడి వెంకటపుల్లంరాజు, ఎక్స్ ఆఫిషియో మెంబర్ దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది
తలుపులమ్మలోవకు భక్తుల వెల్లువ దేవస్థానానికి రూ.5.50 లక్షల ఆదాయం తుని రూరల్ : ఆషాఢమాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లోవకు తరలివచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున దేవస్థానానికి చేరుకున్న భక్తులు ఉదయం కురిసిన భారీవర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తెరిపి ఇవ్వడంతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉన్న 50 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారని, వివిధ విభాగాల ద్వారా రూ.5.50 లక్షలు లభించిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యాప్రత్యేక క్యూలైన్లు, వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. కాగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రూరల్ ఎస్సై ఎం.అశోక్ ఆధ్వర్యంలో 50మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు దేవస్థానం ఆధీనంలోని కాటేజీలు, పొంగలి షెడ్లు లభించక అవస్థలు పడ్డారు. వర్షంతో వంటలు చేసుకునేందుకు వసతి లేక కొండ దిగువన ఉన్న ప్రైవేట్ పాకలు, మామిడి, జీడిమామిడి తోటలను ఆ్రÔ¶ యించారు. ఇదే అదునుగా ప్రైవేట్ పాకల యజమానులు రూ.500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేశారు. కొబ్బరికాయల దుకాణంలో నగదు స్వాధీనం అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో దేవస్థానం లైసెన్సు పొందిన కొబ్బరి కాయల దుకాణంలో ఈఓ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కొబ్బరికాయ, అరటి పండ్లు, ఆకు, వక్క, పసుపు, అగరుబత్తిల సెట్‌ను రూ.25కి విక్రయించేందుకు అనుమతి ఉండగా రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నట్టు గుర్తించి కౌంటర్లో ఉన్న రూ.7,660 నగదును స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుకు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని, నిర్దేశించిన ధరలకు అమ్మకాలు చేయని దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.