తలుపులమ్మ సన్నిధిలో బొత్స ఝాన్సీ | lova temple in jhonsy | Sakshi
Sakshi News home page

తలుపులమ్మ సన్నిధిలో బొత్స ఝాన్సీ

Published Sun, Jan 22 2017 10:31 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

lova temple in jhonsy

తునిరూరల్‌ (తుని) : 
లోవదేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారిని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, కుమారుడు డాక్టర్‌ సందీప్‌లు దర్శించుకున్నారు. ఆదివారం దేవస్థానానికి వచ్చిన ఝాన్సీలక్ష్మి, సందీప్‌లకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ముష్టి వెంకటపురుషోత్తమ శర్మ, రాణి సుబ్రహ్మణ్యశర్మ, ప్రధాన అర్చకులు దూలం సత్యనారాయణ, దూలం త్రినాథరావు  ఆశీర్వదించారు. ఆలయ, అమ్మవారి చరిత్రలను వివరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, బుల్లెబ్బాయి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్‌ గుబ్బల రామకృష్ణ ఆలయ అధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement