అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది | lova temple very rush with yatrikulu | Sakshi
Sakshi News home page

అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది

Published Sun, Jul 17 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది

అమ్మవారి సన్నిధికి అర లక్ష మంది

తలుపులమ్మలోవకు భక్తుల వెల్లువ
దేవస్థానానికి రూ.5.50 లక్షల ఆదాయం
తుని రూరల్‌ :
ఆషాఢమాసం రెండో ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లోవకు తరలివచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున దేవస్థానానికి చేరుకున్న భక్తులు ఉదయం కురిసిన భారీవర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తెరిపి ఇవ్వడంతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉన్న 50 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారని, వివిధ విభాగాల ద్వారా రూ.5.50 లక్షలు లభించిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్, ఈఓ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యాప్రత్యేక క్యూలైన్లు, వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. కాగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రూరల్‌ ఎస్సై ఎం.అశోక్‌ ఆధ్వర్యంలో 50మంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు దేవస్థానం ఆధీనంలోని కాటేజీలు, పొంగలి షెడ్లు లభించక అవస్థలు పడ్డారు. వర్షంతో వంటలు చేసుకునేందుకు వసతి లేక కొండ దిగువన ఉన్న ప్రైవేట్‌ పాకలు, మామిడి, జీడిమామిడి తోటలను ఆ్రÔ¶ యించారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ పాకల యజమానులు రూ.500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేశారు. 
కొబ్బరికాయల దుకాణంలో నగదు స్వాధీనం
అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో  దేవస్థానం లైసెన్సు పొందిన కొబ్బరి కాయల దుకాణంలో ఈఓ చంద్రశేఖర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. కొబ్బరికాయ, అరటి పండ్లు, ఆకు, వక్క, పసుపు, అగరుబత్తిల సెట్‌ను రూ.25కి విక్రయించేందుకు అనుమతి ఉండగా రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నట్టు గుర్తించి కౌంటర్లో ఉన్న రూ.7,660 నగదును స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తామని, నిర్దేశించిన ధరలకు అమ్మకాలు చేయని దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement