- కిటకిటలాడిన వ్రత మండపాలు
- స్వామివారిని దర్శించుకున్న 25 వేల మంది
అన్నవరం భక్త జన సంద్రం
Published Sat, Nov 5 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
అన్నవరం :
సత్యదేవుని ఆలయం శనివారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసంలో వచ్చిన తొలి శనివారం, పంచమి తాత్కాల షష్ఠి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు సత్యదేవుని దర్శనానికి పోటెత్తారు. సాయంత్రం వరకూ ఈ రద్దీ కొనసాగింది. స్వామి వారి వ్రత మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అనంతరం గోశాలలో సప్త గోవులకు, రాజగోపురం ఎదురుగా ఉన్న రావిచెట్టుకు ప్రదక్షణలు చేశారు. స్వామి వారిని 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,656 వ్రతాలు జరి గాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం
కార్తీక మాసం సందర్భంగా ఐదు రోజులుగా సత్యదేవుని సన్నిధిలో ఆకాశదీపం పెడుతున్నారు. ప్రతీరోజూ సాయంత్రం ఆరు గంటలకు అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆకాశ దీపానికి పూజలు చేసి గర్భాలయంలోని స్వామివారికి అభిముఖంగా ఆ దీపాన్ని వేలాడదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 చెల్లించి భక్తులు కూడా పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement