విష్ణు ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ సదస్సులు
Published Tue, Aug 30 2016 8:24 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
భీమవరం : భీమవరం విష్ణు ఫార్మసీ కళాశాల, అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ఫ్రొఫెషనల్స్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి రెండురోజుల పాటు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్టు విష్ణు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ప్రసాద్ చెప్పారు. 1న 5వ ఇండో ఆఫ్రికన్ కాన్ఫరెన్స్‌లో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్ ఇన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్ ’ అనే అంశంపై మెకాలివ్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ సుభాష్‌చంద్ర దిండా, కర్ణాటక డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి ప్రసంగిస్తారన్నారు. అలాగే 2న 2వ ఇండ్ గల్ఫ్ కాన్ఫరెన్స్‌లో నానో టెక్నాలజీ ఫ్రమ్ బేసిక్ రీసెర్చ్ టు నానో మెడిసిన్ అనే అంశంపై సౌదీ అరేబియా జజాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ భక్తిభూషణ్ బారిక్, హైదరాబాద్ మహేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్ ప్రసంగిస్తారని ప్రసాద్ చెప్పారు. ఈ సదస్సుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు రానున్నట్టు తెలిపారు.
Advertisement