రేపు టి–20 క్రికెట్ సెలెక్షన్స్
Published Mon, Aug 22 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
భీమవరం: భీమవరం లూథరన్ హైస్కూల్ ఆవరణలో బుధవారం రాష్ట్ర టి–20 క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్టు ఏపీ యూత్ 20–20 క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ భాస్కర్‌గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు వైట్ డ్రెస్, షూ, క్రికెట్ కిట్స్‌తో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 8వ తేదీ నుంచి మూడురోజులు పాటు కోల్‌కతాలో జరిగే 43వ గోల్డ్‌కప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్ 99512 37511, 90526 28586 నంబర్లలో సంప్రదించాలని భాస్కర్‌గౌడ్ కోరారు.
Advertisement
Advertisement