ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష సమావేశం
భీమవరం : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ స్వయంగా అప్పటి ప్రధాని ప్రకటించినా నేటి కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భీమవరంలో జూన్‌లో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ పనబాక లక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించి శనివారం భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ రాము ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ్టతోనే సాధ్యమన్నారు. దీనికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఫీవుల్లా బేగ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యార్లగడ్డ రాము, గాదిరాజు లచ్చిరాజు, కొల్లి అప్పారావు, కె. సత్తిబాబు,జె ట్టి గురునాథరావు, బోకూరి విజయరాజు, కరీముల్లా బాషా తదితరులు పాల్గొన్నారు.