in june
-
జూన్‌లో సేవల వేగం డౌన్!
న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వేగం మేతో పోల్చితే జూన్‌లో కొంత మందగించింది. మేలో 61.2 వద్ద ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, జూన్‌లో 58.5కు తగ్గింది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50పైన కొనసాగడం వరుసగా 23వ నెల. సూచీ తాజా సమీక్షా నెల్లో కొంత మందగించినప్పటికీ, వ్యవస్థలో డిమాండ్, కొత్త వ్యాపార పరిమాణాలు, ఉపాధి కల్పనకు సంబంధించి సానుకూల వాతావరణమే ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. తయారీ, సేవలు కలిపితే... తయారీ, సేవల రంగాలు కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61.6 వద్ద ఉంటే, మేలో 59.4కు తగ్గింది. ఈ సూచీ కూడా వృద్ధి ధోరణిలోనే పటిష్టంగా ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. భారత పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70% వాటా కలిగిన ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మేలో 31 నెలల గరిష్ట 58.7 స్థాయిని చూసిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జూన్‌లో 57.8కి తగ్గింది. 400 తయారీ సంస్థల పర్చేజింగ్ మేనేజర్లకు పంపిన సమాధానాల ప్రాతిపదికన కదలికలు ఉంటాయి. -
ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష సమావేశం
భీమవరం : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ స్వయంగా అప్పటి ప్రధాని ప్రకటించినా నేటి కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భీమవరంలో జూన్‌లో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ పనబాక లక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించి శనివారం భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ యార్లగడ్డ రాము ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ్టతోనే సాధ్యమన్నారు. దీనికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఫీవుల్లా బేగ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యార్లగడ్డ రాము, గాదిరాజు లచ్చిరాజు, కొల్లి అప్పారావు, కె. సత్తిబాబు,జె ట్టి గురునాథరావు, బోకూరి విజయరాజు, కరీముల్లా బాషా తదితరులు పాల్గొన్నారు. -
జూన్‌లో రాష్ట్రపతి రాక..హైదరాబాద్‌లో విడిది
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో వేసవి విడిది చేయనున్నారు. జూన్ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వారం నుంచి పది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సి ఉండగా... అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయింది. గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతి ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. దీంతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలను కలిసేందుకు ఆయన కొంతసమయం వెచ్చిస్తారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ఒక బృందం హైదరాబాద్‌కు వచ్చి ఈ విడిదికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి వెళ్లినట్లు తెలిసింది. మే నెలాఖరున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రణాళికను విడుదల చేసే అవకాశముంది.