
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన భక్తులు విరాళం అందచేశారు. పటమటకు చెందిన కోనేరు మురళీకృష్ణ, విజయలక్ష్మి దంపతులు భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. వారు నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ల విరాళాన్ని ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు.