మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట | mavullamma temple heavy rush | Sakshi
Sakshi News home page

మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట

Published Sat, Jan 28 2017 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట - Sakshi

మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట

భీమవరం (ప్రకాశం చౌక్‌) : పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు భారీగా తరిలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు చీరలు, జాకెట్‌ ముక్కలు సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన గరిషే రవీందర్, మంజులా దంపతులు 60 గ్రాముల 800 మిల్లీ  గ్రాముల (రాళ్ల, పూసలతో సహా )బంగారం హారం బహుకరించారు. ఆలయ ఈవో నల్ల సూర్యచక్రధరరావు దాతలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement