gold gift
-
జగ్గారెడ్డి బంగారం
-
ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’
కొచ్చి: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ‘మిల్లీగ్రామ్ గోల్డ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది. ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ తెలిపారు. -
Viral: వధువుకు 60 కేజీల బంగారం బహుకరించిన వరుడు
వివాహ వేడుకలో పెళ్లి కూతురు బంగారు ఆభరణాలతో మెరిసిపొంది. కొన్ని సంపన్న కుటుంబాల్లో పెళ్లి కూతురుకు బంధువులు, అతిథులు బంగారాన్ని కూడా బహుకరిస్తారు. అయితే వివాహ వేడుకనలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కాబోయే భర్త ఇచ్చిన భారీ బంగారు ఆభరణాలను వధువు ధరించడం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హుబే ప్రావిన్స్లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. సెప్టెంబర్ 30న జరిగిన ఈ వివాహ వేడుకలో భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. ఒక్కోటి కిలో బరువున్న 60 బంగారు నెక్లెస్లను వరుడు ఆమెకు కానుకగా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి తన చేతిలో గులాబీలు పట్టుకుని ఒంటి నిండా నగలతో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వధువును బంగారు ఆభరణాల్లో ముంచెత్తాడు. భారీ బంగారు ఆభరణాలతో కనిపించే వధువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మావుళ్లమ్మ సన్నిధిలో భక్తుల కిటకిట
భీమవరం (ప్రకాశం చౌక్) : పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు భారీగా తరిలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు చీరలు, జాకెట్ ముక్కలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన గరిషే రవీందర్, మంజులా దంపతులు 60 గ్రాముల 800 మిల్లీ గ్రాముల (రాళ్ల, పూసలతో సహా )బంగారం హారం బహుకరించారు. ఆలయ ఈవో నల్ల సూర్యచక్రధరరావు దాతలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు.