కన్నీళ్లు తుడుస్తాం | we support you | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తుడుస్తాం

Published Thu, Sep 15 2016 9:21 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

కన్నీళ్లు తుడుస్తాం - Sakshi

కన్నీళ్లు తుడుస్తాం

ఆదోని: పట్టణంలోని దివాకర్‌ రెడ్డి నగర్‌లో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తపాల నరసమ్మ కష్టాలు పంచుకొని.. కన్నీటిని తుడిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ‘‘కష్టాలకే కన్నీళ్లొస్తే..’’ శీర్షికన ‘సాక్షి’లో గరువారం ప్రచురితమైన కథనాన్ని దాతలు నిండు మనసుతో స్పందిస్తున్నారు. ఏడేళ్లలోపు ఇద్దరు పిల్లలు.. ఏ అవయవం పనిచేయక జీవచ్ఛవంలా మారిన భర్త పోషణకు ఆమె సాగిస్తున్న జీవన పోరాటం వేదనా భరితం. ఈ నేపథ్యంలో ఆదోని పట్టణంలోని అంగన్‌వాడీ సెంటర్‌–126కు చెందిన ఉపాధ్యాయురాలు ఆమెకు తోచిన ఆర్థిక సాయం అందించారు. చాలా మంది ఆమె ఫోన్‌ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్‌ కావాలని ‘సాక్షి’ విలేకరికి ఫోన్‌ చేశారు.
 
నరసమ్మ ఫోన్‌ నెంబర్‌ : 9100315870
ఆంధ్రా బ్యాంకు, ఆదోని ఖాతా నెం.000210100113833(ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డిబి0000002)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement