నన్నయపై సవతి ప్రేమ! | nanayya college financial problems | Sakshi
Sakshi News home page

నన్నయపై సవతి ప్రేమ!

Published Fri, Nov 18 2016 9:34 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

నన్నయ విశ్వవిద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని పలువురు విద్యావేత్తలు ఆక్షేపిస్తున్నారు. వర్సిటీకి చెల్లించాల్సిన రూ.60 కోట్లు విడుదల చేయకపోవడంపై నిరసన తెలుపుతున్నారు. వర్సిటీ సొమ్ముతో భూమి కొనుగోలు, నిర్మాణ ఖర్చులు చేయించి,

  • సొంత సొమ్ముతోనే భూమి కొనుగోలు,భవన నిర్మాణాలు
  • ఇస్తామన్న రూ.60 కోట్లు విదల్చని ప్రభుత్వం
  • ఆర్థిక ఇబ్బందుల్లో నన్నయ యూనివర్సిటీ
  • కంబాలచెరువు : 
    నన్నయ విశ్వవిద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని పలువురు విద్యావేత్తలు ఆక్షేపిస్తున్నారు. వర్సిటీకి  చెల్లించాల్సిన రూ.60 కోట్లు విడుదల చేయకపోవడంపై నిరసన తెలుపుతున్నారు. వర్సిటీ సొమ్ముతో భూమి కొనుగోలు, నిర్మాణ ఖర్చులు  చేయించి, ఆ ని««దlులను తర్వాత ఇస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో వర్సిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఎంతో మక్కువతో ఉభయగోదావరి జిల్లాలకు తలమానికంగా నన్నయ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అప్పటనుంచి వర్సిటీ నిర్మాణానికి భూ సేకరణ ప్రారంభించారు. వైఎస్సార్‌ అకాల మృతితో వర్సిటీకి సదుపాయాల కల్పన విషయంలో పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. రైతుల వివాదంతో అంచెంలంచెలుగా 99 ఎకరాల భూమి సేకరించారు. దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి యూనివర్సిటీకి ఇవ్వాలి. నిధులు రాకపోవడంతో భూ సేకరణ అడ్డంకిగా మారింది. 2011లో అప్పటి వర్సిటీ వీసీ జార్జివిక్టర్‌ హయాంలో యూనివర్సిటీ నిధులు రూ.22 కోట్లు చెల్లిస్తే తర్వాత తాము ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై పలు మార్లు లేఖ రాసినా ఫలితం శూన్యం. విద్యార్థులు, కళాశాలల నుంచి వచ్చిన ఫండ్‌ను ఉపయోగించి రూ.28 కోట్లతో యూనివర్సిటీలో లైబ్రరీ, ఇంజనీరింగ్‌ కళాశాల, ఉమె¯Œ్స హాస్టల్, కన్వెన్ష¯ŒS సెంటర్లను నిర్మించారు. ఆ సొమ్ము కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కొత్త యూనివర్సిటీలు అన్నింటికి రూ.10 కోట్లు మంజూరు చేశారు. నన్నయకు కనీసం ఆ సొమ్ము కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి రూ.60 కోట్లు రావాల్సివుంది. ఆర్థికశాఖ మంత్రి జిల్లాకు చెందినవారైనా వర్సిటీకి నిధులు విడుదల చేయకపోవడంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు మంజూరు చేస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వర్సిటీ ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
    రాష్ట్రంలోనే అతి పెద్ద వర్సిటీగా గుర్తింపు
    నన్నయ వర్సిటీ రాష్ట్రంలోనే అతిపెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో 450 కళాశాలలు, లక్షా 25 వేల మంది విద్యార్థులతో, 1100 మంది క్యాంపస్‌ విద్యార్థులతో నడుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో నిరుద్యోగులకు ఉద్యోగభృతికి 18 హెచ్‌ఆర్‌డీ సెంటర్లను ప్రారంభించడమే కాక 290 గ్రామాలను దత్తత తీసుకుంది. ఇంతటి యూనివర్సిటీకి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం దారుణమని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. 
    నిధులు రావాల్సివుంది
    జార్టి విక్టర్‌ వీసీగా పనిచేసిన సమయంలో భూమి కొనుగోలుకు, భవన నిర్మాణాలకు సొంత సొమ్ములు ఖర్చుచేసుకుంటే తర్వాత ఇస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చింది. ఆ నిధులు రాకపోయినా ఇటీవల వర్సిటీ అభివృద్ధికి వేరే నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. బకాయి నిధులు వస్తే వర్సిటీని మరింత అభివృద్ధి చేయవచ్చు.
    –ముర్రు ముత్యాలనాయుడు, నన్నయ వైస్‌ చాన్సలర్‌ 
     
     
     
      
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement