disappoinment
-
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
హింద్ జింక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4) లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 2,583 కోట్లకు పరిమితమైంది. పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 2,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,074 కోట్ల నుంచి రూ. 8,863 కోట్లకు నీరసించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,511 కోట్లకు ఎగసింది. -
హతవిధీ! ఇక్కడే ఇలా ఉంటే.. ఇతర జిల్లాల్లో మన పరిస్థితి ఏంటి?
సాక్షి, కృష్ణా: ‘జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోతుందని నేనస్సలు ఊహించనేలేదు. ఇక్కడ పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనిపిస్తోంది. ఇక్కడే ఇలా ఉంటే ఇక ఇతర జిల్లాల్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవేదన, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ నాపై దాడి జరిగినా ఇంతేగా’ అంటూ వాపోయారనేది పార్టీ వర్గాల ద్వారా అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం. గన్నవరంలో కె.పట్టాభిరాం హల్చల్, పోలీసులపై దాడి తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగిందని, తక్షణం గన్నవరానికి శ్రేణులను పెద్దఎత్తున తీసుకెళ్లండని ఆదేశించారు. ఎవరూ అంతగా స్పందించలేదని తెలుసుకున్న చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పలు సూచనలు చేసి ఆయనతోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహింపజేశారు. అయినా ముఖ్యులు ముఖం చాటేయడంతో అధినేత ఆగ్రహం కట్టలు తెంచుకుందని సీనియర్ నేత ఒకరు వివరించారు. కృష్ణాలోనే పార్టీ పరిస్థితి ఇలా తయారవుతుందని తాను ఊహించలేదని, ఇక్కడే ఇలా ఉంటే ఇతర జిల్లాల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించాలంటూనే.. ఇక్కడంతా అయిపోయిందని ఆవేదన వ్యక్తంచేయడంతో తామంతా మౌనం వహించిక తప్పలేదన్నారు. ఒకానొక దశలో మీరెందుకూ పనికిరారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. జిల్లా నాయకులకు కొంతకాలం పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వొద్దని సంబంధితులను ఆదేశించారని సమాచారం. ఇంతలా మీరెందుకు ఉన్నారని ప్రశ్నించడంతో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తొలుత స్పందిస్తూ ప్రభుత్వ చర్యల వల్ల, పోలీసుల తీరుతో నాయకులు ఎవరూ బయటకు రావడంలేదని, కేసులకు భయపడుతున్నారని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. గన్నవరంలో ముఖ్య నాయకులు అందుబాటులో లేకపోవడం, పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినమాట వాస్తవమేనని వివరించడంతో చంద్రబాబు కాస్త చల్లబడినట్లు మరో నాయకుడు అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కారణంగానే ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బాగా డిస్టర్బ్ అయ్యిందని బుద్దా వెంకన్న తనదైన శైలిలో వల్లెవేశారనేది సమాచారం. ఏది ఏమైనా గన్నవరం వెళ్లాలి కదా... గన్నవరంలో వరుస సంఘటనల తర్వాత మీరంతా వెళ్లండని చెప్పినా స్పందించకపోవడం తప్పేనని, నాయకులే ఉదాశీన వైఖరితో ఉంటే పార్టీ క్యాడర్, ప్రజలకు ఏం సందేశం వెళుతుందని చంద్రబాబు అనడంతో ఇకపై జాగ్రత్తగా ఉంటామని ముఖ్యులు చెప్పుకొచ్చారని తెలిసింది. పట్టాభి తప్పుడు వ్యవహారశైలి ఎవరికీ నచ్చకపోవడమే అసలు కారణమని ఆ తరువాత అంతర్గత చర్చల్లో వివరించారనేది సమాచారం. అయినా బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, మాగంటి బాబు, కేశినేని శివనాథ్ (చిన్ని), వెనిగండ్ల రాము తదితరులు వెళ్లారని కొనకళ్ల చెప్పుకొచ్చారు. కొల్లు రవీంద్ర, కేశినేని నాని, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, బొండా ఉమాతో పాటు ఇతర నియోజకవర్గాల నాయకులూ ముఖం చాటేశారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చి హౌస్ అరెస్టు చేయాలని కోరినట్లు అధినేత దృష్టికి వెళ్లింది. ఆరోగ్యం బాగోలేదని పలువురు, జిల్లాలో లేమని మరికొందరు సాకులు వెతుకున్నారని చంద్రబాబుకు తెలిసింది. చివరకు గన్నవరం నేతలూ.. చివరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండల పార్టీ నాయకులు, ఇతర సీనియర్లు కూడా అటువైపు రాకపోవడంతో చంద్రబాబుకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ వాస్తవ పరిస్థితిపై మరింత అవగాహన వచ్చిందని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు బాబు వెన్నంటి.. టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యులకు తలంటడంతో ఎట్టకేలకు శుక్రవారం చంద్రబాబుతో పాటు గన్నవరం పర్యటనలో కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు కొనకళ్ల, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, రావి వెంకటరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్ చెప్తున్నారు: జోగి రమేష్ -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్‌ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్‌ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్‌కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్‌లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కాంగ్రెస్ లో నైరాశ్యం!
సాక్షి,మహబూబ్‌నగర్ : ఒకనాడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీ నేడు సరైన నేతల్లేక వెలవెలబోతోంది. నమ్ముకున్న నాయకులు పార్టీలు మారడంతో శ్రేణులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా సెగ్మెంట్లలో పార్టీ ఇన్‌చార్జ్‌లు లేకుండానే పార్లమెంటు ఎన్నికలకు పోవాల్సిన విపత్కర పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహం ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరి పార్టీ అభ్యర్థిగా, కల్వకుర్తి ఇన్చార్జ్ డాక్టర్ వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు. జడ్చర్ల ఇన్చార్జ్ డాక్టర్ మల్లు రవి నాగర్‌కర్నూల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థులుగా తలపడుతున్నారు. అయితే గద్వాల కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉండటమేగాక పార్టీ శ్రేణులను సొంత బలగంగా డీకే అరుణ సిద్ధం చేసుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి క్యాడర్ ఆమె వెంటే నడుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సొంత బావ, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డిని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. కొడంగల్, జడ్చర్ల, కల్వకుర్తిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎంపీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని డీసీసీ వర్గాల సమాచారం. మూడు చోట్ల దిక్కెవరో...! ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్ ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కారెక్కగా, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి సైతం టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు సుమారు నాలుగున్నర ఏళ్లుగా ఖాళీగా ఉన్న మక్తల్ సెగ్మెంట్‌కు పార్టీ బాధ్యులు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగానే చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను డీకే అరుణ తీసుకోవడంతో అప్పట్లో ఇన్చార్జ్ నియామకం సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. కాని ఆమెతోపాటు కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి సైతం టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ తరఫున ఎవరిని నియమిస్తారోనన్న చర్చ కొనసాగుతోంది. కాగా, డీకే అరుణ అనుయాయుడు, దేవరకద్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఇన్చార్జ్, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడైన డాక్టర్ వంశీకృష్ణ పార్టీని వీడనున్నారని ప్రచారం జరగడం కాంగ్రెస్‌ను మరింత కలవరపరుస్తోంది. -
దుర్గమ్మ ఆలయంలో దాతల ఆవేదన
విజయవాడ: దుర్గమ్మ ఆలయంలో అధికారుల తీరుతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు ఉత్సవాల సమయంలో వీఐపీలు వెళ్లే దారిలో అనుమతిస్తారు. ప్రతి ఏటా ఈ పద్ధతిలోనే దాతలకు అనుమతులు కల్పిస్తూ.. పాస్‌లు జారీ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది డోనర్ పాసులతో వస్తున్న వారిని వంద రూపాయల టిక్కెట్ లైన్లో రావాలంటూ అధికారులు ఆదేశించడంతో.. దాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన తమకు కనీస మర్యాద ఇవ్వకపోవడం శోచనీయం అని అంటున్నారు. ఈ ఏడాది ఈఓగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి హయంలో సదుపాయాలు మెరుగుపడతాయని తాము ఊహించామని కానీ.. దాతలకే ఇలాంటి అవమానం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.