న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4) లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 2,583 కోట్లకు పరిమితమైంది.
పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 2,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,074 కోట్ల నుంచి రూ. 8,863 కోట్లకు నీరసించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,511 కోట్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment