Hindustan Zinc
-
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
యూఎస్‌లో హిందుస్తాన్ జింక్ రోడ్‌షోలు.. వాటా విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌లో మిగిలిన 29.54 శాతం వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం యూఎస్‌లో రోడ్‌షోలకు ఈ నెలలో తెరతీయనుంది. ప్రమోటర్ సంస్థ వేదాంతా.. తమ గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఇది కంపెనీవద్ద గల భారీ నగదు నిల్వలను వినియోగించుకునేందుకు తీసుకున్న నిర్ణయంగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో మిగిలిన వాటాను విక్రయించాలని గతేడాదిలోనే నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వేదాంతా ప్రణాళికలను వ్యతిరేకించింది. కాగా.. వేదాంతా జింక్ ఆస్తుల విక్రయ ప్రతిపాదన గడువు గత నెలలో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం సొంత కార్యాచరణకు సన్నాహాలు ప్రారంభించింది. వెరసి ప్రభుత్వ వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైలర్లకు విక్రయించేందుకు వీలుగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను పరిశీలిస్తున్నట్లు దీపమ్ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం హిందుస్తాన్ జింక్‌లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. గ్లోబల్ జింక్ ఆస్తులను హిందుస్తాన్ జింక్‌కు 298.1 కోట్ల డాలర్లకు విక్రయించాలని వేదాంతా గతంలో ప్రతిపాదించింది. అయితే సంబంధిత పార్టీ లావాదేవీగా ఈ డీల్‌ను పరిగణించాలని, ఫలితంగా నగదురహిత బదిలీ చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయ సంబంధ అవకాశాలనూ పరిశీలించేందుకు నిర్ణయించుకుంది. గతేడాదిలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ).. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల 29.54 శాతం వాటాకు సమానమైన 124.79 కోట్ల షేర్ల విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హింద్ జింక్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4) లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 2,583 కోట్లకు పరిమితమైంది. పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 2,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,074 కోట్ల నుంచి రూ. 8,863 కోట్లకు నీరసించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,511 కోట్లకు ఎగసింది. -
‘హరిత’ వాహనాలపై బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్ ఆధారిత మైనింగ్ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు. 2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది. -
అమ్మకానికి కోల్ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా సేల్ చేయనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. 16500 కోట్లు ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ డిజ్‌ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌లో భాగంగా కోల్ ఇండియా,ఎన్టీపీసీ, హిందుస్తాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్, ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ (ఆర్ఐటీఈఎస్) వాటాల్ని ఆఫర్ ఫల్ సేల్కు పెట్టనుంది. 10-20శాతం వాటాల విక్రయం పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. టార్గెట్ రూ.65 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్ఇన్వెస్ట్మెంట్) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)వెబ్సైట్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ చేతిలో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది. -
అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కేంద్ర ఖజానాలోకి రూ.36 వేల కోట్లు!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 29.53 శాతం వాటా విక్రయ వ్యవహారాలు చూసేందుకు ఐదు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూపు గ్లోబల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఆరు వరకు మర్చంట్ బ్యాంకర్లు వాటాల విక్రయ వ్యవహరాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మర్చంట్ బ్యాంకర్ల కోసం దీపమ్ ఈ ఏడాది జూలైలో బిడ్లను ఆహ్వానించింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లు, సకాలంలో వాటాలు విక్రయించడం, ఇన్వెస్టర్ల అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇన్వెస్టర్ రోడ్ షోలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవడం తదితర వ్యవహరాల్లో దీపమ్‌కు సేవలు అందిస్తాయి. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వం వాటాల విక్రయంతో రూ.36,000 కోట్ల వరకు సమకూర్చుకునే అవకాశం ఉంది. -
మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం!
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హింద్ జింక్‌లో ప్రభుత్వానికి 29.53 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జాబితాలో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు శుక్రవారం(12న) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటా విక్రయ నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. కంపెనీలో ప్రస్తుతం వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి👉 రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం? -
హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటా విక్రయంపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2002లో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో 26 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత ఏడాది ఇచ్చిన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం సూచించిన విధంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసులో తాజా పరిస్థితిపై నివేదికను దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణను చేపడతామని పేర్కొంది. సుప్రీం ఆదేశాల నేపథ్యం... హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్రం ఒక రికాల్ పిటిషన్ వేసింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం అప్పట్లో విబేధించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారస్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా అప్పట్లో రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ‘మే ము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నా ము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యా ఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణ లకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... హిందుస్తాన్ జింక్ లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్ జింక్ లో ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతంసహా మిగిలిన వాటా ప్రభుత్వం, డీఐఐ, ఎఫ్ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఎన్ఎస్ఈలో శుక్రవారం హిందుస్తాన్ జింక్ షేర్ ధర క్రితంలో పోల్చితే స్వల్పంగా పెరిగి రూ.321 వద్ద ఉంది. చదవండి: బ్రెడ్ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై...సీబీఐ విచారణకు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ 4% పైగా పెరిగి రూ.334 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్‌పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి లైన్‌క్లియర్!
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌క్లియర్ అయ్యింది. ఇందుకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. పేర్లు వ్యాఖ్యానించడానికి నిరాకరణ ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయంపై దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని కూడా అత్యున్నత స్థాయి ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వాటాలు ఇలా... హిందుస్తాన్ జింగ్‌లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అతల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్ 10న ఎస్‌ఓవీఎల్ ఓపెన్ మార్కెట్లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్ అగ్రిమెంట్ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ వద్ద హిందుస్తాన్ జింక్‌లో 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గురువారం ట్రేడింగ్ ముగిసే నాటికి ఎస్‌ఓవీఎల్ వాటా 64.92 శాతం కాకుండా, డీఐఐ, ఎఫ్ఐఐ, రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద వరుసగా 32.32 శాతం, 0.83 శాతం, 1.93 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో షేర్ ధర క్రితంలో పోల్చితే 2.92 శాతం (రూ.9.70) తగ్గి రూ.322.95 వద్ద ముగిసింది. -
18% తగ్గిన హిందుస్తాన్ జింక్ లాభం
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపులో భాగమైన హిందుస్తాన్ జింక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 18 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,057 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.2,505 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,237 కోట్ల నుంచి రూ.6,763 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ వెల్లడించారు. జింక్, ఇతర లోహాల ఆదాయం రూ.6,107 కోట్ల నుంచి రూ.5,547 కోట్లకు, పవన విద్యుత్తు విభాగం ఆదాయం రూ.29 కోట్ల నుంచి రూ.22 కోట్లకు తగ్గాయని వివరించారు. వెండి లోహం ఆదాయం మాత్రం రూ.563 కోట్ల నుంచి రూ.637 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సంవత్సర ఆదాయం రూ.24,272 కోట్లకు... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.8,316 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధితో రూ.9,276 కోట్లకు పెరిగిందని అగ్నివేశ్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం ఆదాయం రూ.21,272 కోట్ల నుంచి రూ.24,272 కోట్లకు పెరిగిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో షేర్‌కు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించామని, ఇప్పుడు ఎలాంటి తుది డివిడెండ్‌ను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 0.3 శాతం లాభంతో రూ.327 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం రూ.2,545 కోట్లు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 33 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,902 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,545 కోట్లకు పెరిగినట్లు హిందుస్తాన్ జింక్ తెలిపింది. రూపాయి బలపడినప్పటికీ, అమ్మకాలు అధికంగా ఉండడం, లోహాల ధరలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆదాయం రూ.5,232 కోట్లకు చేరిందని, వార్షికంగా చూస్తే ఇది 37 శాతం వృద్ధి చెందిందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన మాత్రం ఐదు శాతం వృద్ధి చెందిందని ఆయన తెలియజేశారు. మొత్తం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.5,796 కోట్లకు పెరిగిందని చెప్పారాయన. ఇక మొత్తం వ్యయాలు రూ.2,278 కోట్ల నుంచి రూ.2,763 కోట్లకు పెరిగాయని వివరించారు. రికార్డ్ స్థాయికి వెండి అమ్మకాలు వెండి అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉండటంతో ఈ క్యూ2లో మంచి పనితీరు సాధించామని అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో లోహ ఉత్పత్తి 39 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందిందని వివరించారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు వంద శాతం (రూ.2) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.19,979 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. -
హిందుస్తాన్ జింక్ స్పెషల్ డివిడెండ్ 13,985 కోట్లు
రికార్డు తేదీ ఈ నెల 30 ⇒ ఈ ఏడాది మొత్తం 27,157 కోట్లు ⇒ ఏడాదిలో ఇంత భారీ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ ఇదే న్యూఢిల్లీ: వేదాంత గ్రూ ప్నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.27.50 (1,375 శాతం) చొప్పున ఈ డివిడెండ్‌ను చెల్లించాలని బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశం నిర్ణయించిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్ తేదీగా ఈ నెల 30ని నిర్ణయించామని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో గోల్డెన్ జూబ్లీ డివిడెండ్‌ను చెల్లించాం. తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించాం. ఇప్పుడు స్పెషల్ వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మేం చెల్లించే మొత్తం డివిడెండ్ రూ.27,157 కోట్లకు (డీడీటీ–డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకొని) చేరుతుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లించలేదు’’ అని వివరించారు. తమ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నందున రూ.11,259 కోట్లు దక్కుతాయని పేర్కొన్నారు. 2002లో ఈ కంపెనీని ప్రభుత్వం విక్రయించిందని, అప్పటి నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకుంటే తాము రూ.37,517 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని తెలిపారు. ఈ కంపెనీ వెండి, జింక్, సీసం లోహాలను ఉత్పత్తి చేస్తోంది. -
హయ్యస్ట్ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) భారీ డివిడెండ్ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ 13.985 కోట్ల మధ్యంతర డివిడెండ్ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం చెల్లించిన డివిడెండ్ విలువ రూ.27,157 కోట్లకు చేరింది.దీంతో దేశంలో అతి పెద్ద డివిడెండ్ చెల్లించిన కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచింది. స్పెషల్ వన్ టైం మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 1,375 శాతం మధ్యంతర డివిడెండ్ లేదా డివిడెండ్ పంపిణీ పన్ను (డిడిటి) సహా, రూ 13.985 కోట్లను ప్రకటించింది. దీని ప్రకారం రూ .2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుకు రూ.27.50లను చెల్లించనుంది. 2016 ఏప్రిల్ లో చెల్లించిన గోల్డెన్ జుబ్లీ డివిడెండ్, అక్టోబర్ లో చెల్లించిన డివిడెండ్ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ వాటాదారులకు స్పెషల్ డివిడెండ్ చెల్లించడం సంతోషంగా ఉందని, విలువ పంపిణీలో కంపెనీ నిబద్ధతను, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ ఛైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. కాగా మార్చిలో రూ.2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుపై రూ.24 డివిడెండ్ చెల్లించింది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో జింక్, వెండి ఉత్పత్తిలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీ హిందుస్థాన్ జింక్. -
‘జింక్’లో మైనారిటీ వాటాతో ప్రయోజనం లేదు..
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వం మైనారిటీ వాటా (29.54 శాతం) కొనసాగించేందుకు తగిన కారణం ఏదీ కనిపించడం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కీలక వ్యాఖ్య చేశారు. ‘హెచ్‌జెడ్‌ఎల్‌లో మెజారిటీ వాటా ప్రైవేటు కంపెనీకి ఇచ్చేసిన తర్వాత ఆ కంపెనీలో ప్రభుత్వానికి ఇక ఎటువంటి వ్యూహాత్మక ప్రయోజనం లేదు. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తనకున్న మైనారిటీ వాటా కొనసాగించేందుకు ఎటువంటి వాస్తవిక కారణం కనిపించడం లేదు’ అని గోయెల్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. వాటా విక్రయంపై స్పందిస్తూ... చట్టపరమైన అవసరాలుంటే వాటిని నెరవేరుస్తామని తుది నిర్ణయం మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ విభాగం చేతిలోనే ఉందన్నారు. కాగా, హెచ్‌జెడ్‌ఎల్‌లో వాటా విక్రయానికి అంత తొందరేమిటంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 2002లో కేంద్ర ప్రభుత్వం హెచ్‌జెడ్‌ఎల్‌లో 26 శాతం వాటాను రూ.445 కోట్లకు వేదాంత గ్రూప్‌నకు విక్రయించింది. ఆ తర్వాత వేదాంత మరో 20 శాతం సాధారణ వాటాదారుల నుంచి కొనుగోలు చేసింది. 2003లో కాల్ ఆప్షన్ ద్వారా మరో 18.92 శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది. ఇంకా 29.54 శాతం వాటా కేంద్రం చేతిలో ఉంది. -
47 శాతం తగ్గిన హిందుస్తాన్ జింక్ లాభం
ఆదాయం 30 శాతం డౌన్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 47 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,940 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,037 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఉత్పత్తి వ్యయం బాగా పెరగడం, పన్నులు, తరుగుదల అధికంగా ఉండడమే దీనికి కారణమని హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,630 కోట్ల నుంచి 30 శాతం క్షీణించి రూ.2,531 కోట్లకు తగ్గిందని తెలిపారు. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే రాబడి 19 శాతం తగ్గిందని పేర్కొన్నారు జింక్ అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రంగా ఉన్న రూపాయి ఒడిదుడుకులు, అధిక స్థాయిలో ఉన్న వెండి ధరలు దెబ్బకొట్టాయని వివరించారు.ఇబిటా 33 శాతం క్షీణించి రూ.1,130 కోట్లకు తగ్గిందని, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 13 శాతం తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో జింక్ ధరలు 14 శాతం పెరిగాయని, మైనింగ్ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ 1.3 శాతం లాభంలో రూ.194 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం రూ.2,149 కోట్లు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమాసిక కాలానికి రూ.2,149 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం(రూ.1,997కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. 2014-15 క్యూ4లో రూ.4,126 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 శాతం తగ్గి రూ.3,132 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు, మార్కెట్ సెంటిమెంట్ కుదేలై ఉండడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మంచి పనితీరు కనబరిచామని వివరించారు. గత నెలలో తమ వాటాదారులకు ప్రత్యేక స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లించామని పేర్కొన్నారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 0.4 శాతం నష్టపోయి రూ.174 వద్ద ముగిసింది. -
ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్
♦ పన్నులు రూపేణా మరో రూ.2,000 కోట్లు ♦ స్పెషల్ డివిడెండ్ రూ.3,000 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఈ డివిడెండ్ తోడ్పడుతుందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి హిందుస్తాన్ జింక్ కంపెనీ 1200% గోల్డెన్ జూబిలీ డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.24 డివిడెండ్‌ను ఇస్తామని పేర్కొంది. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. రూ.2,995 కోట్ల డివిడెండ్ చెక్‌ను కంపెనీ సీఈఓ టామ్ అల్బనీజ్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారు. ఈ రూ.3,000 కోట్ల డివిడెండ్ మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి పన్నుల రూపేణా మరో రూ.2,000 కోట్లు. మొత్తం మీద రూ.5,000 కోట్లు వస్తాయని ఈ వారం ప్రారంభంలో పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
హిందుస్తాన్ జింక్ డివిడెండ్ రూ.10,141 కోట్లు
♦ అత్యధిక డివిడెండ్ చెల్లిస్తున్న ప్రైవేట్ కంపెనీ ♦ 1200 శాతం స్పెషల్ గోల్డెన్ జూబ్లీ డివిడెండ్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10,141 కోట్లు డివిడెండ్ చెల్లించనున్నది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను చెల్లిస్తున్న తొలి ప్రైవేట్ రంగ కంపెనీ ఇదే. డివిడెండ్ ట్యాక్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ.12,205 కోట్లకు చేరుతుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఈ డివిడెండ్‌లో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు చెల్లిస్తున్నామని హిందుస్తాన్ జింక్ సీఈఓ సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమైన స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని వివరించారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై 1200 శాతం(రూ.24) డివిడెండ్‌ను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. 2002-03లో ప్రభుత్వం ఈ కంపెనీలో నియంత్రిత వాటాను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. 29.54 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. వాటా విక్రయం తర్వాత 2002 నుంచి రాయల్టీలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, డివిడెండ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్.. తదితరాల రూపేణా ప్రభుత్వానికి రూ. 32,500 కోట్లు చెల్లించామని దుగ్గల్ వివరించారు. వేదాంత అనుబంధ కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ వెండి, జింక్, లెడ్ లోహాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా బీఎస్ఈలో ఈ షేర్ 3.1 శాతం లాభంతో రూ.175 వద్ద ముగిసింది. -
బాల్కో, హిందుస్థాన్ జింక్ల్లో మిగిలిన వాటా కొంటాం
♦ రూ.25,000 కోట్లు ఇస్తాం ♦ వేదాంత అనిల్ అగర్వాల్ ఆఫర్ న్యూఢిల్లీ: హిందుస్థాన్ జింక్, భారత్ అల్యూమినియం కంపెనీల్లో మిగిలిన ప్రభుత్వ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఈ వాటా విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.25,000 కోట్లు(370 కోట్ల డాలర్లు) వస్తాయని వివరించారు. వేదాంత కంపెనీ భారత్ అల్యూమినియం కంపెనీలో 51 శాతం వాటాను 2000-01లో రూ.551.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే హిందుస్థాన్ జింక్‌లో 2002-03లో 26 శాతం వాటాను రూ.445 కోట్లకు, ఆ తర్వాత మరో 18.92 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇన్వెస్టర్ల నుంచి మరో 20 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు బాల్కోలో మిగిలిన 49 శాతం వాటాను, హిందుస్థాన్ జింక్‌లో 29.54 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నామని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ వాటాల అసలు విలువ రూ.500 కోట్లు ఉంటుందని, కానీ ఈ వాటాల విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.25,000 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. దేశంలో జింక్ ఉత్పత్తిని నియంత్రించే ఏకైక కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్‌లో వాటా విక్రయం సరైన చర్య కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు గనుల మంత్రిత్వ శాఖ లేఖ రాసిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ఈ విధంగా స్పందించారు. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయం వద్దు
ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం * చట్ట ఉలంఘనలు జరుగుతున్నాయని * పిటిషనర్ ఆరోపణ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వంవద్ద మిగిలి ఉన్న వాటాలను విక్రయించవద్దని (డిజిన్వెస్ట్‌మెంట్) అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ సంస్థలో మెజారిటీ వాటాను (64.92 శాతం) వేదాంతాకు ప్రభుత్వం 14యేళ్ల క్రితం విక్రయించింది. వేదాంతా అనుంబంధ సంస్థ స్టెరిలైట్ వేదాంత యాజమాన్య నియంత్రణలో ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా సుప్రీం ఆదేశంతో వ్యూహాత్మక ఖనిజాలతో ముడివడిఉన్న కంపెనీలో విలువైన 29.54 శాతం వాటాల విక్రయానికి బ్రేక్ పడినట్లయ్యింది. ఈ వాటాలకు సంబంధించి యథాతథ పరిస్థితిని కొనసాగించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంబంధిత పక్షాలను ఆదేశించింది. పిటిషన్ దాఖలు కారణం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సంఘాల జాతీయ సమాఖ్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. తొలి దఫా పెట్టుబడుల ఉపసంహరణల సమయంలోనే చట్ట సంబంధ ఉల్లంఘనలు జరిగాయని సమాఖ్య తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి గతంలో ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌లో చట్ట ఉల్లంఘనల విషయం స్పష్టమైనట్లు వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాససం, ‘సంబంధిత చట్ట సవరణలు చేయనిదే తిరిగి తాజా వాటాలను ఎలా విక్రయిస్తారు’ అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. వేదాంతాకు విలువైన ఆస్తులు అప్పగించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోతాంగీని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి తదుపరి వాటాల విక్రయం జరగరాదని స్పష్టం చేసింది. తొందరలేదు: ప్రభుత్వం కాగా ప్రస్తుత వాటాల విక్రయంపై తొందరలేదని గనుల వ్యవహారాల కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. ఇందుకు న్యాయ, మార్కెట్ ఒడిదుడుకుల కారణాలను తెలిపారు. -
హిందూస్తాన్ జింక్ లాభం 5 శాతం అప్
న్యూఢిల్లీ: హిందూస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,285 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ నికర లాభం(రూ.2,184 కోట్లు)తో పోల్చితే 5 శాతం వృద్ధి సాధించామని హిందూస్తాన్ జింక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,802 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.4,033 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అమ్మకాల వృద్ధి, నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మంచి ఫలితాలను సాధించామని హిందూస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. జింక్ ధరలు తగ్గినప్పటికీ, అమ్మకాలు పెరగడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ఆదాయం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమాన నిల్వలు రూ.34,568 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. వీట్లి మ్యూచువల్ పండ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.25,310 కోట్లని, రూ.5,530 కోట్లు బాండ్లలో, రూ.3,505 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నాయని వివరించింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉండగా, మిగిలింది సెసా స్టెరిలైట్‌కు ఉంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 3 శాతం లాభంతో రూ.158 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం 19% అప్
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,921 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,618 కోట్లతో పోలిస్తే 19 శాతం అధికం. రూపాయి క్షీణత, అధిక పరిమాణంలో విక్రయాలు .. లాభాల పెరుగుదలకు తోడ్పడినట్లు హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ తెలిపారు. ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 3,596 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇతర బేస్ మెటల్ ధరలు తగ్గుతున్నప్పటికీ జింక్ ధర మాత్రం మెరుగ్గానే కొనసాగిందని, పలు గనుల మూసివేత కారణంగా రాబోయే రోజుల్లోనూ దీని రేటు పటిష్టంగానే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాంపుర అగూచా, కయాద్, సిందేశ్వర్ ఖుర్ద్ తదితర గనుల కారణంగా జింక్ ఉత్పత్తి వార్షికంగా 42 శాతం పెరిగి 2,32,162 టన్నులకు చేరిందని పేర్కొన్నారు. అయితే, త్రైమాసికాల వారీగా చూస్తే మాత్రం 14 శాతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు.