న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్)లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 29.53 శాతం వాటా విక్రయ వ్యవహారాలు చూసేందుకు ఐదు మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూపు గ్లోబల్ మార్కెట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ప్రభుత్వానికి ఆరు వరకు మర్చంట్ బ్యాంకర్లు వాటాల విక్రయ వ్యవహరాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మర్చంట్ బ్యాంకర్ల కోసం దీపమ్ ఈ ఏడాది జూలైలో బిడ్లను ఆహ్వానించింది.
ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లు, సకాలంలో వాటాలు విక్రయించడం, ఇన్వెస్టర్ల అభిప్రాయాలు తెలుసుకోవడం, ఇన్వెస్టర్ రోడ్ షోలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవడం తదితర వ్యవహరాల్లో దీపమ్‌కు సేవలు అందిస్తాయి. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వం వాటాల విక్రయంతో రూ.36,000 కోట్ల వరకు సమకూర్చుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment