న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
హింద్ జింక్‌లో ప్రభుత్వానికి 29.53 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జాబితాలో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సంస్థలు శుక్రవారం(12న) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటా విక్రయ నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. కంపెనీలో ప్రస్తుతం వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది.
చదవండి👉 రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం?
Comments
Please login to add a commentAdd a comment