నేటి అలంకారం శ్రీ గాయత్రీదేవి
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదా (భయం కుశకశా) శ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మదారవింద యుగళం హసై ్తర్వహంతీ భజే
శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన ఆశ్వీయుజ శుద్ధ విదియ గురువారం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తి, వేదమాత అయిన శ్రీ గాయత్రీదేవి ఐదు ముఖాలతో వరదాభయహస్తాలు ధరించి కమలాసనాసీనరాలుగా భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త దేవత మంత్రాలకు ఈ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది.
ఆయా దేవతల మూలమంత్రాలతో గాయత్రిని చేర్చి ఉపాసన చేస్తారు. సమస్త దేవతలకు నైవేద్యం పెట్టే పదార్థాలన్నింటినీ గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేస్తారు.
-విజయవాడ (ఇంద్రకీలాద్రి)