Gayatri Devi
-
దసరా మహోత్సవాల రెండో రోజు.. శ్రీ గాయత్రిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు (ఫోటోలు)
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు ఉత్సవాలు
-
గాయత్రీ దేవికి ఇది పెట్టండి మీ జీవితం మారిపోతుంది!
-
పన్నీరుకు కొడుకుతో తలనొప్పి.. అన్నగా భావిస్తే ఆశపడి..
సాక్షి, చైన్నె: ఓ సామాన్యుడి న్యాయం పోరాటం ఎంపీ పదవి కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటున్న మాజీ సీఎం పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. గత కొన్ని నెలలుగా తనకు లైంగిక వేధిస్తున్నారంటూ ఆయనపై బుధవారం డీజీపీ శంకర్ జివ్వాల్ కార్యాలయంలో చైన్నెకు చెందిన గాయత్రి దేవి ఫిర్యాదు చేశారు. ఇందులో 2014లో బంధువుల వివాహ సమయంలో పన్నీరు సెల్వం కుటుంబ సభ్యులతో తన కుటుంబానికి పరిచయం ఏర్పడినట్టు ఆమె పేర్కొన్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఫ్యామిలీ, తమ ఫ్యామిలీ అందరం ఒకే కుటుంబం తరహాలో మెలిగే వాళ్లమని పేర్కొన్నారు. అయితే గత ఏడాది చివరి నుంచి పన్నీరు సెల్వం తనయుడు రవీంద్రనాథ్ రూపంలో తనకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఆయన్ని తన సొంత అన్నయ్య లాగా భావించానని, ఆ విధంగానే ఆయనతో మెలిగానని పేర్కొన్నారు. అయితే, ఆయన మిత్రుడు ఒక రోజు ఫోన్ చేసి రవీంద్రనాథ్‌కు తానంటే ఎంతో ఇష్టం అని తెలియజేశాడని, సహకరిస్తే రాణిలా ఉంటావు.. లేకుంటే చంపేస్తామని బెదిరించినట్టు తెలిపారు. తొలుత ఈ బెదిరింపును తాను పెద్దగా పట్టించుకోలేదని, అయితే, ఓ రోజు మద్యం తాగని తనతో అసభ్యకరంగా రవీంద్రనాథ్ ఫోన్లో మాట్లాడడం ఆవేదనకు గురి చేసిందన్నారు. రోజూ తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఫలితంగా రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అన్నగా భావించిన వ్యక్తి తనపై ఆశ పడుతుండడం గురించి ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు బెదిరింపులు పెరిగాయని, ఆందోళనతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె వాపోయారు. -
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు
జైపుర్ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్ ఫిలిప్ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్ : ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు దగ్గరి పోలికలు ఉండటం!! క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్ మహారాణి గాయత్రీదేవి, మాన్సింగ్ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్సింగ్ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్సింగ్ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్ లో ఆ జంటదీ ఇదే కథ. ఫిలిప్ క్రికెట్ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్ ఎలిజ బెత్కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్సింగ్ గవర్నర్ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్ ఎలిజబెత్ పుట్టిన లండన్‌లోనే. క్వీన్ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్; గాయత్రిదేవి, మాన్సింగ్ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్ కపుల్’. వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్ కూడా! ప్రిన్స్ ఫిలిప్ వేసవిలో పుట్టారు. ఏటా జూన్ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్ ఫిలిప్ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్: ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ దంపతులతో గాయత్రీదేవి, మాన్సింగ్ -
గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి/ శ్రీశైలం : ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రిదేవి. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయం నందు విష్ణువు, శిఖయందు రుద్రడు నివసిస్తుండగా త్రిమూర్తత్యంశగా గాయత్రిదేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వలన మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు. చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు ముక్తా విద్రుడు హేమ నీల దవళచ్ఛాౖయె ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే మయూర వాహనంపై ఆది దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజైన ఆదివారం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే స్వామి, అమ్మవార్లను మయూర వాహనంపై కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలరించిన కేరళ వాయిద్యకారుల ప్రదర్శన ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతి నిత్యం ఆలయ ప్రాంగణంలో కళార్చన జరుగుతుంది. కేరళకు చెందిన పలువురు వాయిద్యకారులు డప్పు వాయిద్యాలతో తమ కళను ప్రదర్శిస్తున్నారు. సుమారు రెండు గంటల పాటు సాగుతున్న కళార్చన విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తున్న పల్లకీ సేవలో పంచవాయిద్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
అందాల రాణికి నూరేళ్లు
ఈ ఏడాది మే 23 కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే రోజు జైపూర్ మహారాణి గాయత్రీదేవి 100వ జయంతి. మరి ఎన్నికలకు, గాయత్రీదేవికి సంబంధం ఏమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారి గాయత్రీ దేవి. అదొకటే కాదు, ఈ అందాల రాణి ఘనతలు, విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి.గాయత్రీదేవి 1919 మే 23న లండన్‌లో పుట్టారు. కూచ్ బెహార్ సంస్థానపు ముద్దుల పట్టి గాయత్రి. బాల్యంలో ఆమెపై ప్రధానంగా ఇద్దరు మహిళల ప్రభావం ఉంది. ఒకరు : ఆమె తల్లి, రాజమాత.1922లో గాయత్రి తండ్రి చనిపోగా, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు రాజమాతే పరిపాలించారు. ఇంకొకరు : గాయత్రి అమ్మమ్మ, బరోడా మహారాణి. ఆమె భర్త తన హయాంలో బరోడాను దేశంలోనే అత్యాధునిక సంస్థానంగా అభివృద్ధి పరిచారు. ఈ ఇద్దరు రాణులూ కలిసి గాయత్రీదేవిని చక్కటి ఇంగ్లీషు సంస్కారంతో కూడిన భారతీయ యువరాణిగా మలిచారు. అందుకే గాయత్రి జైపూర్ మహారాజు మాన్సింగ్ను చేసుకుంటానని అనగానే అక్కడి రాజపుత్రుల కఠిన ఆచారాలను ఈ పిల్ల తట్టుకోగలదా అని కలత చెందారు. అయితే తట్టుకోవడం మాత్రమే కాదు, ఆధునిక యువతిగా తన ప్రత్యేకతను, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు గాయత్రీదేవి. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాన వ్యూహాలు, వ్యవహారాలలో భర్తకు చేదోడుగా, కీలక సలహాదారుగా నిలిచారు. 1943లో ‘గాయత్రీదేవి బాలికల పాఠశాల’ను నెలకొల్పి, తొలి యేడాదే 40 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ టీచర్ని నియమించారు. చాలా త్వరగా ఆ పాఠశాలకు మంచి పేరు వచ్చింది. దేశంలోనే అత్యుత్యమ బాలికల పాఠశాలగా గుర్తింపు పొందింది.1947లో స్వాతంత్య్రం వచ్చాక జైపూర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. జైపూర్ రాజధాని అయింది. ఆమె భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. అయితే అధికారాలన్నిటినీ కాంగ్రెస్ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఆ పరిస్థితుల్లోనే గాయత్రీదేవి స్వతంత్రపార్టీలో చేరారు.1970లో ప్రభుత్వం సంస్థానాలను పూర్తిగా రద్దు చేసింది. గాయత్రీదేవి, అమె భర్త కొన్నాళ్లు ఇంగ్లండ్‌లో గడిపారు. అక్కడ ఉన్నప్పుడే మాన్ సింగ్ పోలో ఆటకు అంపైరింగ్ చేస్తూ కుప్పకూలి, మరణించారు. అనంతరం ఆయన మొదటి భార్య పెద్ద కొడుకు భవానీసింగ్ మహారాజుగా తండ్రి బాధ్యతలను స్వీకరించారు. గాయత్రీదేవి రాజమాత అయ్యారు. ఆవిడ ఆ శోకంలో ఉండగానే ప్రజల అభీష్టం మేరకు మూడోసారి పార్లమెంటుకు పోటీ చేయవలసి వచ్చింది.1975 ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. మొదట ఆసుపత్రికి తరలించి, తర్వాత పెరోల్‌పై (సత్పవర్తన కలిగి ఉంటాననే హామీపై!) ఆమెను విడుదల చేశారు.ఆ తర్వాతి రెండున్నర దశాబ్దాలు గాయత్రీదేవి జీవితం ఒక రాజపుత్ర వితంతువు జీవితంలా నిస్సారంగా, నిరర్థకంగా గడవలేదు. ప్రపంచమంతటా పర్యటించారు. వేసవి కాలాలను ఇంగ్లండ్‌లో తాను చదువుకున్న మంకీ క్లబ్ పాఠశాల ఉన్న ప్రాంతమైన నైట్స్‌బ్రిడ్స్‌లో; శీతాకాలాలను జైపూర్‌లో తమ ఇద్దరి కోసమే తన భర్త కట్టించిన లిలీపూల్ సౌధంలో ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిపారు. 1980లలో ‘ప్రిన్సెస్ రిమెంబర్స్’ అనే పేరుతో ఆమె ఆత్మకథ ఇంగ్లండ్‌లో వెలువడింది. తొంభై ఏళ్ల వయసులో 2009లో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. 1943లో ఈ అసమాన సౌందర్యవతి ఫొటోలను సెసిల్ బీటన్ అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇప్పటికీ ఆ ఫొటోలు దేశ విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో ఎక్కడో ఒకచోట నిరంతరం దర్శనం ఇస్తూనే ఉంటాయి. ప్రేమ.. పెళ్లి.. జైలు గాయత్రికి పదమూడేళ్ల వయసులోనే మాన్సింగ్ ఆమె మనసులో పడిపోయాడు! అప్పుడతడికి 21 ఏళ్లు. అందగాడు, సంపన్నుడు. మంచి ‘పోలో’ ఆటగాడు. జైపూర్ జట్టులో మాన్సింగ్ ఉన్నాడంటే గెలుపు అన్న మాటనే ప్రత్యర్థులు మర్చిపోవాలి. ఆటతో పాటు అతడినీ ఇష్టపడింది గాయత్రి. ఎనిమిదేళ పాటు వీళ్ల మధ్య ప్రేమ నడిచింది. అమె 21వ ఏట పెళ్లి జరిగింది. అప్పటికే మాన్‌సింగ్‌కి రెండు పెళ్లిళ్లు! అయినా సరే, మూడో భార్యగా అతడి చెయ్యి అందుకుంది. అదీ రహస్యంగా, ఆ తర్వాత అధికారికంగా. ఇటు కూచ్ బెహర్ సంస్థానంలో, అటు జైపూర్ సంస్థానాల్లో పెద్ద సంచలనం! అయితే ఈ సంచలనం మహారాణీ గాయత్రీదేవి జీవితంలో చాలా చిన్నది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారిగా గాయత్రీ దేవి కలకలం రేపారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘స్వతంత్ర పార్టీ’ తరఫున జైపూర్ నుంచి నిలబడి 1,92,909 ఓట్లు గెలుచుకుని (పోలైన 2,46,516 ఓట్లలో) గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు! తిరిగి 67 ఎన్నికల్లోనూ, 71 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఐదు నెలలపాటు తీహార్ జైల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఆమెపై కక్ష కట్టి జైపూర్ పన్ను చెల్లింపులు సరిగా లేవన్న అబద్ధపు నేరారోపణలతో ఆమెను జైలుపాలు చేసింది. గాయత్రి ఘన విజయం ఏడు విడతల పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు విడతలు పూర్తయ్యాయి. గత సోమవారం జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో రాజస్థాన్‌లోని పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఆ రాష్ట్రంలోని మిగిలిన పన్నెండు స్థానాలకు ఐదవ విడత ఎన్నికల్లో భాగంగా నేడు సోమవారం (మే 6) పోలింగ్ జరుగుతోంది. ఆ పన్నెండు స్థానాల్లో ఒకటైన జైపూర్.. సార్వత్రిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. మహారాణి గాయత్రీదేవిని, ఆమె సాధించిన ఘనతను గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజస్థాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ గాయత్రీదేవి. ‘స్వతంత్రపార్టీ’ తరఫున వరుసగా మూడుసార్లు (1962, 1967, 1971) ఆమె గెలిచారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే మొత్తం పోలైన ఓట్లలో 78 శాతం ఓట్లు సాధించి ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కారు! -
నేటి అలంకారం శ్రీ గాయత్రీదేవి
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్ గాయత్రీం వరదా (భయం కుశకశా) శ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హసై ్తర్వహంతీ భజే శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన ఆశ్వీయుజ శుద్ధ విదియ గురువారం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తి, వేదమాత అయిన శ్రీ గాయత్రీదేవి ఐదు ముఖాలతో వరదాభయహస్తాలు ధరించి కమలాసనాసీనరాలుగా భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త దేవత మంత్రాలకు ఈ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. ఆయా దేవతల మూలమంత్రాలతో గాయత్రిని చేర్చి ఉపాసన చేస్తారు. సమస్త దేవతలకు నైవేద్యం పెట్టే పదార్థాలన్నింటినీ గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేస్తారు. -విజయవాడ (ఇంద్రకీలాద్రి)