
భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షత్రం ఏడుపాయల ఆదివారం తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీర పాయల్లో నీరు తక్కువగా ఉండటంతో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఘనపురం ఆనకట్ల నుంచి నీటిని దిగువకు వదిలేలా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు మంజీర పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.
అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించుకుని మొక్కలు తీర్చుకున్నారు. రాజగోపురం నుంచి ఆలయంవరకు భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులుతీరారు. పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి,ఈఓ వెంకట్‌కిషన్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయం వద్ద ఏఎస్‌ఐ సందీప్‌రెడ్డి పోలీసుల బందోబస్తు నిర్వహించారు.