divotees rush
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొ మురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆది వా రం భక్తుల సందడి నెలకొంది. సిద్దిపేట, జనగా మ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, నల్లగొం డ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చా రు. దీంతో మల్లన్న ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామి వారిని ద ర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచి భ క్తులు బారులు తీరారు. మల్లన్నకు ఒక్క పొద్దుల తో బోనాలు తీశారు. బోనాలను రంగులతో అ లంకరించి డప్పు చప్పుళ్లతో శివసత్తులు బోనాలు ఎత్తుకొని గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామికి ఒగ్గు పూజారులతో పట్నాలు వేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ఒక్క పొద్దులు వదిలారు. మల్లన్న స్వామి దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మరికొంత మంది భక్తులు మల్లన్న ఆలయంలోని ఆలయ ముఖ మండపంలో స్వామికి కల్యాణం జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్నకు మొక్కులు అప్పగించి మల్లన్న గుట్టపై కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరిం టెండెంట్ రావుల సుదర్శన్, నీల చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. -
భక్త జన ‘బాబా’ మెట్ట
విజయనగరం టౌన్ : పురవీధులు పులకించిపోయాయి. భక్తిప్రపత్తులతో, బాబా నామస్మరణతో మెట్ట ప్రాంతం నిండిపోయింది. కులమతాలకతీతంగా ప్రతిఒక్కరూ భక్తిభావంతో మదినిండుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబా చిత్రపటంవద్ద, సమాది వద్ద గులాబీలు, చాదర్ ఉంచి పూజలు నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాబా దర్గా నిర్వహకులు ఏర్పాట్లు చేశారు. దారంతా ప్రత్యేక ఒంటెల ఆకర్షణ, గుర్రపు బగ్గీపై బాబా చిత్రపటంతో ఊరేగింపుతో భక్తులు తన్మయత్వం పొందారు. హజరత్ సయ్యద్ బాబా మహమ్మద్ తాజుద్దీన్ తాజుల్ అవులియా (నాగపూర్) ప్రియ శిష్యులు హజరత్ సయ్యద్ షహిన్‌షా బాబా ఖాదర్‌వలీ (విజయనగరం)బాబా 59వ గంథమహోత్సవ వేడుకలు శుక్రవారం స్థానిక ఖాదర్ నగర్లోఉన్న బాబామెట్టలో ఉన్న దర్గాలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు ఖురాన్ షరీఫ్ పఠనం, అనంతరం దర్బార్, షరీఫ్ నుంచి నషాన్, చాదర్ సందల్ షరీఫ్‌లతో ఫకీర్ మేళా ఖవ్వాళితో ప్రత్యేక వాహనంలో నగర వీధుల్లో దర్గా షరీఫ్‌కు భారీ ఊరేగింపు చేశారు. ముతావల్లి మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీబాబా (చీమలపాడు) బాబా దివ్యసందేశాన్ని భక్తులకు అందజేశారు. అనంతరం సుమారు 30వేలమందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన హజరత్ సాబిర్ ముగ్దుమ్ కలియార్ ముతవల్లి అలీ ఎజాజ్ సాబ్రీ, ఆస్తాన్ ఏ తాజ్ ఖాదరియా (ఏటీకే) ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రతినిధులు ఎమ్ఎస్.జాఫర్ సాదీక్, మహ్మద్ ఖలీలుల్లా షరీఫ్, ఖ్వాజా మెహీద్దీన్, అతా మహమ్మద్, సిద్దిక్, షేక్ బహుదూర్, హజరత్ ఖాదర్ వలీ బాబా దర్గా, దర్బార్ షరీఫ్ షా ముతావల్లి«(దర్మకర్త) అతావుల్లా తాజ్ ఖాదరీ బాబా తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు.. ఖాదర్ వలీ బాబా గంథమహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం, భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఒంటెలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
జనసంద్రంగా ఏడుపాయల
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షత్రం ఏడుపాయల ఆదివారం తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీర పాయల్లో నీరు తక్కువగా ఉండటంతో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఘనపురం ఆనకట్ల నుంచి నీటిని దిగువకు వదిలేలా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు మంజీర పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించుకుని మొక్కలు తీర్చుకున్నారు. రాజగోపురం నుంచి ఆలయంవరకు భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులుతీరారు. పాలకవర్గ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి,ఈఓ వెంకట్‌కిషన్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయం వద్ద ఏఎస్ఐ సందీప్‌రెడ్డి పోలీసుల బందోబస్తు నిర్వహించారు. -
కిటకిటలాడిన ఏఎస్‌పేట దర్గా
అనుమసముద్రంపేట:ఏఎస్‌పేటకు శనివారం సైతం పెద్దయెత్తున భక్తులు, యాత్రికులు తరలివచ్చారు. వందలాది ప్రత్యేక వాహనాల్లో వచ్చిన భక్తులుతో దర్గా పరిసరాలు, ప్రధాన వీధులు కిక్కిరిశాయి. దర్గాలోని శ్రీహజ్రత్ సయ్యద్ ఖాజారహంతుల్లా నాయబ్‌రసూల్, అమ్మాజీల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గలేపులు, పూల దుప్పట్లు కప్పారు. దర్గా సజ్జాదానషీన్ షాగులాం నక్షాబంద్ హఫీజ్‌పాషా ప్రత్యేక గీతాలు ఆలాపించారు. దర్గా ట్రస్టీ ఆధ్వర్యంలో తాగునీటి వసతి, అన్నదానం చేశారు. యాత్రికులతో దుకాణాలు కొత్త కళ సంతరించుకున్నాయి. ఆత్మకూరు ఆర్టీసీ అధికారులు శనివారం ప్రత్యేక బస్సులను తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ కార్యదర్శి అప్పాజీ పారిశుద్ధ్య పనులు పలువీధుల్లో చేయించారు. అయితే వైద్యశాల వీధి, బలిజవీధి, పడమర వీధుల్లో సక్రమంగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆరోపించారు. -
రొట్టెల కోసం ఆరాటం
స్వర్ణాల చెరువు వద్ద భక్తుల కోలాహలం షహీదులకు ఘనంగా తహలీల్ ఫాతెహా అలరించిన క్రాకర్స్ షో నేడూ కొనసాగనున్న పండుగ నెల్లూరు(అర్బన్) : బారా షహీద్ దర్గాలో శనివారం కూడా భక్తుల కోలాహలం కొనసాగింది. దేశ, విదేశాలతో పాటు స్థానికులు కూడా ఎక్కువగా తరలివచ్చారు. వీరితో దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. నాలుగో రోజు నిర్వహించిన తహలీల్ ఫాతెహాకు వేలాదిమంది హాజరయ్యారు. స్వర్ణాల చెరువు తీరంలో రొట్టెల మార్పిడి కొనసాగుతూనే ఉంది. భక్తులు రొట్టెల కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. ఆరోగ్యం, విద్య, వివాహం, సౌభాగ్యం, విదేశీయానం, పదోన్నతి, సంతానం, నూతన గృహాల రొట్టెలను భక్తులు ఎక్కువగా ఇచ్చి పుచ్చుకున్నారు. ఆదివారం కూడా పండుగ కొనసాగనుంది. కులమతాలకు అతీతంగా.. రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ బుధవారం రాత్రి మత గురువులు బారాషహీదులకు సొందల్ మాలిక్‌ను లేపనం చేయడంతో ప్రారంభమైంది. కులమతాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు అతీతంగా తమ కోర్కెలు తీరాలంటూ అనేకమంది భక్తులు సంకల్పిచారు. పాకిస్తాన్, దుబాయ్ తదితర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. తమ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో పుణ్యస్నానమాచరించారు. రొట్టెలు మార్చుకున్నారు. బారాషహీదులను దర్శించుకుని వరములిమ్మని మొక్కుకున్నారు. నెల్లూరుకే ప్రత్యేకత రొట్టెల పండుగ దేశంలోనే గుర్తింపు పొందింది. నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద జరిగే ఈ పండుగ నెల్లూరుకే ప్రత్యేకతను తెచ్చింది. ప్రభుత్వం సైతం గత సంవత్సరం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు విడుదల చేసింది. కోర్కెలు తీరిన వారు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతారు. కొత్తగా కోర్కెలు కోరే వారు ఆరొట్టెలు అందుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. తహలీల్ ఫాతెహాతో ముగిసిన పండుగ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముజావర్లు, మతగురువులు తహలీల్ ఫాతెహా నిర్వహించారు. బిందె నిండా గంధాన్ని తీసుకుని ఫకీర్ల జరుబులు(తప్పెట్లు)తో దర్గా చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. గంధాన్ని బారాషహీదులకు లేపనం చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధాన్ని భక్తులకు పంచి పెట్టారు. అనంతరం పండుగ ముగిసినట్టు మత పెద్దలు ప్రకటించారు. ఈ తహలీల్ ఫాతెహాలో దర్గా కమిటీ అధ్యక్షుడు జంషీద్, దర్గా ముజావర్ రఫీ, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా ప్రత్యేక ఏర్పాట్లు పండుగ ముగిసినప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. మధ్యాహ్నం పలుచగా ఉన్న భక్తులు సాయంకాలం అయ్యే సరికి ఒక్కసారిగా పెరిగిపోతున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. అధికారులు 15లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇప్పటికి 12లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులు కూడా భక్తులు దర్గాకు రానున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు పండుగ ముగిసినప్పటికీ ఆదివారం కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు యథావిథిగా కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య పరిరక్షణ, లైటింగ్, తాగునీరు తదితర వసతులు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం , ఆరోగ్య రొట్టెలకు డిమాండ్ ఈ దఫా నిర్వహించిన పండుగలో ఉద్యోగం, ఆరోగ్య రొట్టెల కోసం డిమాండ్ కన్పించింది. పలువురు నిరుద్యోగులు ఉద్యోగం రొట్టె కోసం తిరిగారు. ఆరోగ్యం కోసం అనేకమంది రొట్టెలు మార్చుకున్నారు. కొంతమంది తమ బిడ్డలకు మంచి సంబంధాలు రావాలని కోరుకుంటూ పెళ్లి రొట్టెలు మార్చుకున్నారు. గతంలో రొట్టె పట్టుకుని పెళ్లయిన నూతన దంపతులు ఈ సంవత్సరం రొట్టెలు వదిలారు. నేడు అవార్డులు పండుగ నిర్వహణలో కష్టపడి పని చేసిన అధికారులకు, సిబ్బందికి ఆదివారం అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్‌తో ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొననున్నారు. -
కనులపండువగా శ్రీవారి ఊంజల్‌సేవ
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి ఊంజల్‌సేవ కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 11 గంటలకు నిత్యకల్యాణ మండపంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. రాత్రి ఊంజల్‌సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శశిస్వామి, త్రినా«థ్స్వామి, నాగరాజస్వామి పాల్గొన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధాణంగా ఉంది. సోమవారం ఉదయం ఏడుకొండల వాడి దర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. రథసప్తమి సందర్భంగా ఆదివారం తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారిని తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు 1,00,659 మంది భక్తులు దర్శించు కున్నారు.