మల్లన్నను దర్శించుకుంటున్న భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొ మురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆది వా రం భక్తుల సందడి నెలకొంది. సిద్దిపేట, జనగా మ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, నల్లగొం డ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చా రు. దీంతో మల్లన్న ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామి వారిని ద ర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచి భ క్తులు బారులు తీరారు.
మల్లన్నకు ఒక్క పొద్దుల తో బోనాలు తీశారు. బోనాలను రంగులతో అ లంకరించి డప్పు చప్పుళ్లతో శివసత్తులు బోనాలు ఎత్తుకొని గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామికి ఒగ్గు పూజారులతో పట్నాలు వేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ఒక్క పొద్దులు వదిలారు. మల్లన్న స్వామి దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మరికొంత మంది భక్తులు మల్లన్న ఆలయంలోని ఆలయ ముఖ మండపంలో స్వామికి కల్యాణం జరిపించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మల్లన్నకు మొక్కులు అప్పగించి మల్లన్న గుట్టపై కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరిం టెండెంట్ రావుల సుదర్శన్, నీల చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment