mallanna temple
-
రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు?
కొమురవెల్లి/సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి పదవీ కాలం గత సెప్టెంబర్ 20 తో ముగిసింది. వెంటనే దేవదాయశాఖ అధికారులు రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంటుంది. అందుకు అప్పుడు కొంత మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు పావులు కదిపినా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆలయ రెగ్యులర్ కమిటీకి నోటిఫికేషన్ నిలిచిపోయింది. సమయం లేకపోవడంతో.. ఇటీవల ఎన్నికల ప్రక్రియ పూర్తవడం, నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి చూపు మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి నియామకం వైపు మళ్లింది. జనవరి 7న స్వామి కల్యాణం జరగనుంది. దీంతో దేవదాయశాఖకు రెగ్యులర్ కమిటీ నియమించే సమయంలేదు. రెగ్యులర్ కమిటీని నియమించాలంటే నోటిపికేషన్ జారీచేసి 45 రోజుల సమయం ఇచ్చి దరఖాస్తులు కోరాలి. ఆ తర్వాత వాటిని పరిశీలించి, విచారించి కమిటీని ప్రకటించాలి. స్వామి కల్యాణం వచ్చే నెల 7 ఉండడం, అదేవిధంగా సంకాంత్రి నుంచి జాతర మొదలు కానుడడంతో మూడు నెలల కోసం ఉత్సవ కమిటీని నియమించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పైరవీలు ప్రారంభం! కమిటీ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. సుమారు పదేళ్లు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆ నాయకులకు నామినేటేడ్ పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ ప్రాంత నాయకులు ఉత్సవ, రెగ్యులర్ కమిటీలలో స్థానం కోసం పాకులాడుతున్నారు. చేర్యాల మాజీ జెడ్పీటీసీ నర్సింగరావు, చేర్యాల మాజీ ఎంపీపీ బోడిగె నర్సింహులు, మహదేవుని శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, వల్లాద్రి అంజిరెడ్డి, లింగంపల్లి కనకరాజు, చెరుకు రమణారెడ్డి, జంగనిరవి, జీవన్‌రెడ్డి, ముస్త్యాల యాదగిరితో పాటు జనగామ, మద్దూరు నర్మేట్ట, హుస్నాబాద్‌కు చెందిన మరి కొందరి నేతల పేర్లు చైర్మన్ రేసులో ఉన్నట్టు వినిపిస్తున్నాయి. పొన్నం అనుచరులకే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రధాన అనుచరులకు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని పలువురు స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలలాకు చెందిన స్థానిక నేతలకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని పలువురు కోరుతు న్నట్టు సమాచారం. కొంత కాలంగా ఆలయంలో ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఆలయంలో అధికారులు తమ ఇష్టానుసారంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని, ప్రభుత్వం, దేవదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే ఆలయంలో ధర్మకర్తల మండలి నియమించాలని చాలా మంది కోరుతున్నారు. -
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ..పోటెత్తిన జనం
కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ కార్తీక మాస పర్వదినంలో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మాములుగా ఉండదు. ఈ మేరకు కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రం గురించి చెప్పనవసరం లేదు. వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ విధుల్లో దీపారాధనలు చేసుకున్నారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు పడుతోంది. లోక కళ్యాణం కోసం లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలాగే లక్ష దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు కావాల్సిన వస్తువులను దేవస్థావం వారే ఉచితంగా అందించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్తిక పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్ని భక్తుల కోలహలంతో శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. (చదవండి: రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు ) -
ఘనంగా మల్లన్న పెద్ద పట్నం ఫొటోలు
-
ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర ఫొటోలు
-
మల్లన్న సన్నిధిలో అపచారం
కర్నూలు, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందించేందుకు నిత్య పూజలు జరిగేలా ఈఓ చర్యలు తీసుకుంటుండగా కొందరు ఆలయ అర్చకుల ప్రవర్తన ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మల్లన్న ఆలయ ఆవరణలోనే కొందరు అర్చకులు ఓ పరిచారకుడిని పీఠాధిపతిగా వేషధారణ చేయించి పూల కిరీటం, చేతిలో కమండలం, త్రిశూలం మొదలైన వాటిని అలంకరింప జేశారు. అంతటితో ఊరుకోకుండా వామనావతారం తరహాలో గొడుగు పట్టి, ప్రసాదం సమర్పించారు. అనంతరం అమ్మవారి అలంకార మండపం వద్ద కూర్చొబెట్టి పీఠాధిపతి తరహాలో సేవలు చేశారు. ఈ తతంగమంతా శ్రీభ్రమరాంబాదేవి ప్రధానార్చకులు సన్నిధిలో జరిగినట్లు తెలుస్తోంది. అలాగే అమ్మవారి సేవకు ఉపయోగించే పూజా సామగ్రి వినియోగించినట్లు సమాచారం. ఆ సంఘటనను వీడియో తీసి సన్నిహితులకు పంపడంతో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడం అర్చకులకు తగదని విమర్శిస్తున్నారు. ఈ తతంగమంతా ఈఓ శ్రీరామచంద్రమూర్తి దృష్టికి వెళ్లడంతో ఆ సదరు పరిచారకున్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అతనితో పాటు అర్చక పరిచారకులపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్ర వేషధారణ యువకుడు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కుమారడని సమాచారం. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొ మురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆది వా రం భక్తుల సందడి నెలకొంది. సిద్దిపేట, జనగా మ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, నల్లగొం డ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చా రు. దీంతో మల్లన్న ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామి వారిని ద ర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచి భ క్తులు బారులు తీరారు. మల్లన్నకు ఒక్క పొద్దుల తో బోనాలు తీశారు. బోనాలను రంగులతో అ లంకరించి డప్పు చప్పుళ్లతో శివసత్తులు బోనాలు ఎత్తుకొని గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామికి ఒగ్గు పూజారులతో పట్నాలు వేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ఒక్క పొద్దులు వదిలారు. మల్లన్న స్వామి దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మరికొంత మంది భక్తులు మల్లన్న ఆలయంలోని ఆలయ ముఖ మండపంలో స్వామికి కల్యాణం జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్నకు మొక్కులు అప్పగించి మల్లన్న గుట్టపై కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరిం టెండెంట్ రావుల సుదర్శన్, నీల చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. -
మల్లన్న సన్నిధిలో.. మహాపచారం!
ఎల్లమ్మగుట్ట మీద జంతు బలులకు సన్నాహాలు - అరిష్టమని చెబుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - రూ.30 లక్షలతో జంతుబలి, వంటషెడ్ల నిర్మాణం - భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సాక్షి, సిద్దిపేట: మల్లన్న సన్నిధిలో మహా అపచారం జరగబోతోంది. ఎల్లమ్మ తల్లికి మాంసాహార నైవేద్యం సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 500 ఏళ్లుగా పసుపు బండారిని నుదుట దిద్దుకున్న భక్తులు.. ఇకపై అదే నుదుటి మీద నెత్తుటి తిలకం దిద్దుకోవాల్సి వస్తోంది. ఎల్లమ్మ తల్లికి రక్తతర్పణం మహా పాపం అని, ఇంద్రకీలాద్రికి ఎనిమిది దిక్కుల అష్ట భైరవులు క్షేత్ర పాలకులుగా ఉన్నారని, ఇక్కడ జంతు బలి ఇవ్వటం మహా అపచారం, అరిష్టమని వేద పండితులు, ఆలయ అర్చకులు చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా. ఒగ్గు పూజారులు పట్నం వేసి, మణ్మ య పాత్రతో నివేదనం సమర్పిస్తారు. బెల్లం పొంగలి..పసుపు బువ్వ , టమాట, చిక్కుడుకాయ కూర ఇదే మల్లన్న ఇష్ట నైవేద్యం. మల్లన్నకు తలాపునే ఉన్న ఆయన చెల్లి ఎల్లమ్మ తల్లికి కూడా బెల్లం పొంగలి, పసుపు బువ్వే నైవేద్యంగా చెల్లిస్తారు. ఇది తరతరాల ఆచా రం. ఇప్పుడా ఆచారం అపచారం కాబోతోంది. ఇదంతా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సారధ్యంలో చేస్తున్నారు. కొండమీద మల్లన్న తలాపునే ఉన్న ఎల్లమ్మ గుడివద్ద రూ.30 లక్షలతో జంతు బలిపీఠం షెడ్డు, వంటశాల షెడ్డు నిర్మాణాలు చేపట్టారు. గుట్ట కింద భాగం నుంచి నేరుగా వాహనాలు వెళ్లటం కోసం దాదాపు 300 మీటర్ల పొడవైన బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మల్లికార్జునస్వామి క్షేత్రం పడమర (చూపు)తో పడమటి శివాలయంగా ఉండడంతో ఈ క్షేత్రంలో పూజలు చేస్తే స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా జరుగుతుం దని భక్తులు చెప్పుకుంటారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం చుట్టు అష్టభైరవులు కాపాలాగా ఉండి అందులో ఒకటి ఆలయ గర్భగుడిలో ఉండడంతో ఇక్కడ భక్తులు పూజలు చేస్తే దుష్టశక్తుల నుంచి మల్లన్న, భైరవులు కాపాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మల్లికార్జునస్వామి క్షేత్రం 10వ ,11వ శతాబ్దంలో, కాకతీయుల కాలంలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలసినట్లు స్థల పురాణలు చెబుతున్నాయి. మల్లన్న ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం మల్లికార్జునస్వామికి, సతీమణులైన బలిజ డలమ్మదేవి, గొల్లకేతమ్మ దేవిలు నిత్యం పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి శివలింగం రూపంలో పూజ లుం డగా ఇక్కడ మాత్రం శ్రీమల్లికార్జునస్వామి రూపంలో పూజలు అందుకుంటారు. బలిపీఠాలు సిద్ధం మల్లన్న గుట్ట శిఖరంలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో జంతుబలుల నిర్వహణకుగాను బలి పీఠాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బలి పీఠం ఏర్పాటు చేస్తే ఆలయానికి ఆదాయం సమకూరుతుందనే కారణంతో ఈ అపచారాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించడం విశేషం. కొమురవెల్లిలో కొన్ని శతాబ్దాలుగా మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులు నియమ నిష్టలతో మల్లన్నకు బోనాలు చెల్లిస్తారు. అనంతరం గుట్టపై ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. మొక్కులు అప్పగించి మరుసటి రోజు కొమురవెల్లి సమీపంలోని జగదేవ్‌పూర్ మండలం తిగుల్నర్సాపూరులోని కొండ పోచమ్మ (మల్లన్న చెల్లెలు)గా భావించే నల్లపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. అక్కడ కొండ పోచమ్మ వద్ద అమ్మవారికి మాంసాహారంతో వంటలు వండి మధ్యసాకలు పెడతారు. భక్తులను కొండ పోచమ్మ వద్దకు వెళ్లకుండా ఇక్కడే ఆపగలిగితే కొండ పోచమ్మకు వచ్చే ఆదాయం ఇక్కడకు వస్తుందనే ఆలోచనతో బలిపీఠాల ఏర్పాటుకు పూనుకున్నారు. మే 4న బలిపీఠాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. బలిపీఠంపై బలిచ్చిన మేకలు,కోళ్లను వండుకునేందుకు మల్లన్న గుట్టపైనే రేకులషెడ్ నిర్మిస్తున్నారు. శాఖాహారంతో మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్షేత్రంలో మేకలు, కోళ్లను బలి చ్చేం దుకు ఏర్పాటు చేయటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే మల్లన్న గుట్టపై జంతుబలులను నిషేధించి మల్లన్న క్షేత్ర పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఈ నెల 25నుంచి మల్లన్న బ్ర హ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏర్పా ట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇదేం విడ్డూరం.. మల్లన్నగుట్ట మీద బలిపీఠం నిర్మాణాన్ని ఆలయ అర్చకులందరం వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. ఇక్కడికి మల్లన్న భక్తులు నియమ నిష్టలతో వస్తుంటారు. ఆలయం పవిత్రతపై మాంసం, మద్యం ప్రభావం చూపిస్తుంది. మల్ల న్న తలాపుపైన బలిపీఠం ఉంటే అరిష్టం. సకల జీవులకు అనర్ధం అని గ్రహించాలి. గుట్టపై బలిపీఠాన్ని ప్రోత్సహించకపోవడం ఉత్తమం. – ఆలయ ప్రధాన అర్చకులు -
మల్లన్నను దర్శించుకున్న సినీ నటుడు
కొమురవెల్లి(సిద్ధిపేట జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి సినిమా నటుడు ఫిష్ వెంకట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. పలు సినిమాల్లో విలన్ అసిస్టెంట్ పాత్రలు పోషించి తన కామెడీతో అలరించిన ఫిష్ వెంకట్ మాట్లాడుతూ కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి తనకు ఇష్టదైవమని, ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు. ఇక, స్థానిక ప్రజలు, చిరువ్యాపారులు సినిమా నటుడు ఫిష్ వెంకటేశ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
మల్లన్నస్వామి విగ్రహ ధ్వంసానికి యత్నం
చార్మినార్: నగరంలోని బహదూర్‌పురా రామాటాకీస్ పక్కన ఉన్న మల్లన్న ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్వామి విగ్రహానికి నిప్పంటించేందుకు యత్నించారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహానికి నిప్పంటుకుని వస్త్రాలు కాలిపోయాయి. గురువారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన పూజారి విషయాన్ని గమనించి బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కౌశిక్ తెలిపారు.