కొమురవెల్లి(సిద్ధిపేట జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి సినిమా నటుడు ఫిష్ వెంకట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
పలు సినిమాల్లో విలన్ అసిస్టెంట్ పాత్రలు పోషించి తన కామెడీతో అలరించిన ఫిష్ వెంకట్ మాట్లాడుతూ కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి తనకు ఇష్టదైవమని, ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు. ఇక, స్థానిక ప్రజలు, చిరువ్యాపారులు సినిమా నటుడు ఫిష్ వెంకటేశ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.
మల్లన్నను దర్శించుకున్న సినీ నటుడు
Published Tue, Nov 29 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement
Advertisement